సమష్టిగా గ్రామాల అభివృద్ధికి కృషి చేయండి
నర్వ: గ్రామాల అభివృద్ధికి సమష్టిగా కృషిచేయాలని.. సర్పంచు అంటే నిరంతర ప్రజా సేవకుడు అని పశుసంవర్ధక, పాడి, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం నర్వ సర్పంచు హన్మంతురెడ్డి, పాలకవర్గ సభ్యుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో రాష్ట్రపతి సంతకం ఎంత ముఖ్యమో, గ్రామాభివృద్ధికి సర్పంచు సంతకం అంత ముఖ్యమని, ఎన్నికల వరకే పార్టీలు చూడాలని గ్రామాభివృద్ధిలో అందరు ఏకమై అభివృద్ధి సాదించుకోవాలన్నారు. గెలిచిన నాటి నుండే నర్వ మండలాన్ని దత్తత తీసుకున్నానని తన పదవి ముగిసే నాటికి మండలంలో బీటీ రోడ్లు లేని గ్రామాలు లేకుండా చేస్తానన్నారు. గ్రామంలో సీసీ రహదారులు, డ్రైనేజీల ఏర్పాటుకు రూ. 2 కోట్ల వరకు నిధులు మంజూరు చేస్తానని ఇందుకు పక్క ప్రణాళిక తయారు చేసుకొని కలవాలన్నారు. మండలంలోని ఎన్నో అపరిశ్కృత సమస్యల పరిష్కారానికి నా వంతు శక్తితో కృషిచేస్తానన్నారు. మండలంలో 300 ఇళ్ళు మంజూరు చేస్తే 120 మంది మాత్రమే కట్టారని మొత్తం పూర్తి చేస్తే వెయ్యి ఇళ్ళైన ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నానన్నారు. నియోజకవర్గంలో 3600 ఇళ్లు ఇవ్వాలని సహచర మంత్రి పొంగులేటిని అడిగానన్నారు. రేపటి నుంచి మండల కేంద్రంలో పాడుబడ్డ ఇళ్లు, ముళ్ళపొదలు, అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాలను జేసీబీ పెట్టి శుభ్రం చేయిస్తామని, మంత్రి సహకారంతో అభివృద్ధి చేసుకుందామని నాయకుడు జలందర్‌రెడ్డి అన్నా రు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనువాసులు, పోలీ స్ చంద్రశేఖర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, చెన్నయ్యసాగర్, జగధభిరెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శరణప్ప పాల్గొన్నారు.
సోదరభావంతో పండుగలు జరుపుకోవాలి
మక్తల్: ప్రజలంతా సోదరభావంతో పండుగలు జరుపుకోవాలని, ప్రభుత్వం క్రైస్తవుల అభ్యున్నతి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తుందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. బుధవారం పట్టణంలో ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేశారు. క్రైస్తవులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. మానవ సేవయే మాదవ సేవ అని.. పేదలకు సేవ చేస్తే ఎంతో మంచిదని, ఏసుక్రీస్తు చూపిన మార్గంలో నడవాలని, ప్రేమ, విశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తాయని అన్నారు. ఆర్డీఓ రాంచదర్, నాయకులు లక్ష్మారెడ్డి. వెంకటేస్, శ్రీనివాసులు, పాస్టర్ జాన్‌సన్ గొల్లపల్లి నారాయణ, నాగేస్, రవికుమార్, గణేస్‌కుమార్, నారాయణ పాల్గొన్నారు.


