క్రిస్మస్ వేడుకలకు సిద్ధం
● విద్యుద్దీపాలతో చర్చిల ముస్తాబు
● ఆకట్టుకున్న ముందస్తు వేడుకలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న చర్చిలను కిస్మస్ వేడుకలకు ముస్తాబు చేశారు. ప్రార్థన మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. నారాయణపేట పట్టణంలోని మూడు చర్చిలతో పాటు మండలంలోని భైరంకొండ, కొల్లంపల్లి, సింగారం గ్రామాలలోని చర్చిలను సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దారు. సింగారంలో ఉదయం యోసయ్యను స్మరిస్తూ ఊరేగింపు, ప్రత్యేక ప్రార్థనలను, క్రీస్తూ బోధనలు, డ్రామా కార్యక్రమం, మహిళలలచే గీతాలాపన, కానుకల సమర్పణ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఇదివరకే గ్రామంలో సెమి క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. క్రైస్తవులు తమ ఇంటిపై నక్షత్రాకారంలో లైట్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా నారాయణపేటలోని బీసీ కాలనీలో ఉన్న చర్చిలో బుధవారం సెమీ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. యువతి యువకులు పాల్గొని గీతాలాపన, డ్రామాలతో అలరించారు.
● జిల్లా కేంద్రంలోని యాద్గిర్ రోడ్డు పక్కన ఉన్న ఎంబీ చర్చిను 1952 లో ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ బిల్డింగ్ టన్ మత ప్రచారానికి వచ్చి చర్చ్‌ను ఏర్పాటు చేశారు. ఆయన ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు నడిచిన తర్వాత మోనోనైట్ బ్రదరాన్ అనే సంస్థవారికి అప్పజెప్పగా ఆ సంస్థ పేరు మీదనే దీనికి ఎంబీ చర్చి అనే పేరు వచ్చింది. తదనంతరం ఎంబీ సంస్థ స్థానికంగా ఉన్న రత్నయ్య అనే వ్యక్తి అప్పజెప్పగా 45 సంవత్సరాల నుండి ఆయననే చర్చి నిర్వహణ కొనసాగిస్తున్నారు.


