పార్టీలు, పంతాలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం | - | Sakshi
Sakshi News home page

పార్టీలు, పంతాలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం

Dec 25 2025 10:12 AM | Updated on Dec 25 2025 10:12 AM

పార్ట

పార్టీలు, పంతాలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌/కోస్గి: గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం సమగ్ర అభివృద్ధి చెందినట్లనే విషయాన్ని గుర్తించి నూతనంగా ఎన్నికై న సర్పంచులు గ్రామాల అభివృద్ధికి తమవంతు కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. సమష్టి కృషితో దేశంలోనే కొడంగల్‌ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చినప్పుడే పార్టీలు, రాజకీయాలుంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీలు, పంతాలు పక్కన బెట్టి అభివృద్ధియే ఏకై క ఎజెండాగా గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని పేర్కొన్నారు. బుధవారం జిల్లాలోని కోస్గి పట్టణం ఓ ఫంక్షన్‌హాల్‌లో కొడంగల్‌ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికై న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌లను సన్మానించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ మీరు ఆశీర్వదించిన మీ బిడ్డ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ప్రాతినధ్యం వహిస్తున్నాడు. ఇలాంటి అవకాశం మళ్లీ రాదు. బెట్టి గ్రామాలను అభివృద్ధి చేసుకోవడమే లక్ష్యంగా నూతన సర్పంచ్‌లు పాలకవర్గాలతో కలిసి పని చేయాలి. అభివృద్ధికి ఎన్ని నిధులైన మంజూరు చేస్తా. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులు కాకుండా చిన్న పంచాయతీలకు రూ.5 లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు ప్రత్యేక ముఖ్యమంత్రి నిధులు అందిస్తా. ప్రజలు మీపై నమ్మకంతో ఓట్లు వేసి సర్పంచులుగా గెలిపించారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించే బాధ్యత నూతన సర్పంచ్‌లుగా మీపైనే ఉంది. గ్రామస్థాయి మొదలు మండలస్థాయి నాయకుల వరకు రాజకీయాలు పక్కనబెట్టి అన్ని పార్టీల సర్పంచ్‌లను కలుపుకొని గ్రామాల అభివృద్ధియే ఏకై క లక్ష్యంగా పని చేయాలి.’ అని పేర్కొన్నారు.

చదువుతోనే వెలుగులు

‘చదువుతోనే వెలుగు, మార్పు వస్తుంది. నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాం. కొడంగల్‌ నియోజకవర్గంలో 25 వేల మంది విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రాష్ట్రం మొత్తం అన్ని పాఠశాలల్లో అల్పాహారం, మధ్యాహ్న భోజనం పెట్టించి చదువు చెప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపండి. విద్యా, వసతులు, భోజనం అందిస్తేనే విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. నియోజకవర్గంలోని లగచర్లలో 250 ఎకరాల్లో ఎడ్యుకేషన్‌ హబ్‌ కడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడా లేని సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటు చేస్తున్నాం. దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేలా విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి ఉన్నత చదువులు చదివి ఐఏఎస్‌, ఐపీఎస్‌లు అయ్యి తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలి.’ అని సీఎం సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, కాలె యాదయ్య, నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల కలెక్టర్లు సంచిత్‌ గంగ్వార్‌, ప్రతిక్‌ జైన్‌, అదనపు కలెక్టర్‌ శ్రీను, ఆర్డీఓ రాంచందర్‌ నాయక్‌, డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌రెడ్డి, నాయకులు కుంభం శివకుమార్‌రెడ్డి, వార్ల విజయ్‌కుమార్‌, రఘువర్ధన్‌రెడ్డి, విక్రంరెడ్డి, నర్సిములు, మహేందర్‌రెడ్డి, యూసూఫ్‌, శేఖర్‌, మద్దప్ప దేశ్‌ముఖ్‌, అన్న కిష్టప్ప, నాగులపల్లి నరేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

సర్పంచ్‌ల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్‌

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేకంగా

నిధులు మంజూరు చేస్తా

ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికీ అందించే బాధ్యత సర్పంచులదే

పార్టీలు, పంతాలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం 1
1/1

పార్టీలు, పంతాలు వద్దు.. అభివృద్ధి చేసుకుందాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement