రెండు రోజుల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ ఆదేశించారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బోయపల్లి (డివిజన్ నం.16), హనుమానున్‌నగర్–న్యూగంజి (డివిజన్ నం.47)లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరమైన చోట ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ఈ ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలని సూచించారు. కాగా, ఆయా ప్రాంతాల్లో దరఖాస్తుదారుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. మహబూబ్‌నగర్ కార్పొరేషన్ పరిధిలో ఎల్–1 కింద 1,400 ఇళ్లు కేటాయించారు. అయితే సుమారు రెండు వేల మంది నుంచి దరఖాస్తులు అందగా, క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్, హౌసింగ్ పీడీ వైద్యం భాస్కర్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డి.మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
తొలిరోజు ప్రశాంతంగా ఎప్‌సెట్
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా తొలిరోజు ఎప్‌సెట్ ప్రశాంతంగా జరిగింది. మంగళవారం ఉదయం అగ్రికల్చర్– ఫార్మసీకి సంబంధించి రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని ఫాతిమావిద్యాలయం, జేపీఎన్‌సీలలో పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేయగా, ఉదయం 280, మధ్యాహ్నం 265 మంది విద్యార్థులు హాజరయ్యారు.
రామన్‌పాడులో
1,015 అడుగులు
మదనాపురం: మండలంలోని రామన్‌పాడు జలాశయంలో మంగళవారం నీటిమట్టం సముద్ర మట్టానికి ఎగువన 1,021 అడుగు లకుగాను 1,015 అడుగులు ఉన్నట్లు ఏఈ వరప్రసాద్ తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వలో నీటి సరఫరా లేదని.. జలాశయం నుంచి కుడి, ఎడమ కాల్వలకు 12 క్యూసెక్కులు, తాగునీటి అవసరాలకు 20 క్యూసె క్కుల నీటిని వినియోగిస్తున్నామని చెప్పారు.
మొక్కజొన్న @ రూ.2,266
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి యార్డుకు మంగళవారం పంట దిగుబడులు పోటెత్తాయి. 4,600 క్వింటాళ్ల మొక్కజొన్న, 5,050 క్వింటాళ్ల ధాన్యం విక్రమానికి వచ్చింది. మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,266, కనిష్టంగా రూ.1,501, వేరుశనగ గరిష్టంగా రూ.5,641, కనిష్టంగా రూ.4,329, జొన్నలు గరిష్టంగా రూ.2,627, కనిష్టంగా రూ.2,227, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,931, కనిష్టంగా రూ.1,802, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,309, కనిష్టంగా రూ.1,801, పెబ్బర్లు రూ.4,404 ధరలు లభించాయి.
● దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,141, కనిష్టంగా రూ.1,879, హంస గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ.1,800గా ధరలు నమోదయ్యాయి.


