నర్వ: పేదల ఆరోగ్య సంరక్షణ కోసమే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వాల్ గ్రామంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల కడుపు నింపేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనువాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నయ్యసాగర్, జగన్మోహన్‌రెడ్డి, కృష్ణారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శరణప్ప, జగదీశ్వర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.
8న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ నెల 8న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్–8, 10, 12, 14, 16, 20 బాలబాలికలకు 60 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు అసోసియేషన్ సభ్యులను సంప్రదించాలని సూచించారు.
ప్రతి గ్రామానికిరోడ్డు సౌకర్యం
కోస్గి: ప్రతి గ్రామానికి మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తుందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయకుమార్ అన్నారు. శుక్రవారం గుండుమాల్ మండలంలో బ్రిడ్జీల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌డీఎఫ్ నుంచి మంజూరైన రూ. 7కోట్లతో గుండుమాల్–పగిడియాల్ మార్గంలో, రూ. 8.5 కోట్లతో ముదిరెడ్డిపల్లి–పగిడియాల్ మార్గంలో బ్రిడ్జీలు నిర్మించనున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతగా చేపట్టి, త్వరగా పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విక్రంరెడ్డి, మాజీ ఎంపీపీ మధుకర్‌రావు, మాజీ సర్పంచ్ సురేష్ రెడ్డి, పీఆర్ డిప్యూటీ ఈఈ విలోక్, ఏఈ అంజిరెడ్డి, నాయకులు సుధాకర్ రెడ్డి, గోపాల్‌రెడ్డి, జహీర్ పాల్గొన్నారు.
అల్పాహారం పరిశీలన
మద్దూరు: హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న అల్పాహారాన్ని శుక్రవారం అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంత మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నారు.. ఏ సమయానికి పాఠశాలకు చేరుకుంటుందనే వివరాలను హెచ్‌ఎం సవితను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పాఠశాలలో నెలకొన్న సమస్యలపై ఆయన ఆరా తీశారు. అనంతరం ఎస్‌ఎల్‌టీఏ డైరీని అడిషనల్ కలెక్టర్‌కు ఉపాధ్యాయులు అందించారు.
ఉల్లి క్వింటాల్ రూ.1,200
మక్తల్: పట్టణంలోని మార్కెట్‌యార్డుకు శుక్రవారం ఆరు క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి రాగా.. క్వింటాల్ గరిష్టంగా రూ. 1,200, కనిష్టంగా రూ. 900 ధర పలికింది. ఈ ప్రాంతంలో పండించిన పంటలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా, మక్తల్ మార్కెట్‌లో అమ్మేందుకు ఏర్పాట్లు చేసినట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు.
పేదల ఆరోగ్య సంరక్షణకే సన్నబియ్యం
పేదల ఆరోగ్య సంరక్షణకే సన్నబియ్యం


