2 కిలోమీటర్లు నడిచి వెళ్తాం
మా గ్రామంలో రేషన్ షాపు లేదు. ప్రతి నెల రెండు కిలోమీటర్లు నడిచి పక్క గ్రామానికి వెళ్తాం. ఒక్కోసారి వెళ్లినా బంద్ ఉంటుంది. మా గ్రామస్తులకు సరైన సమాచారం అందడంలేదు. బియ్యం తీసుకురావాలంటే లబ్ధిదారులు ఆ రోజు పని మానుకోవాల్సిందే.
– లక్ష్మణ్, మాజీ సర్పంచ్ అంకేన్‌పల్లి
షాపు మంజూరు చేయాలి
మక్తల్ మున్సిపాలిటీ పరిదిలోని కొత్తగార్లపల్లిలో రేషన్ దుకాణం లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అధికారులు స్పందించి రేషన్‌షాపు మంజూరు చేయాలి. కూలీపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తాము రేషన్ సరుకుల కోసం ప్రతి నెల అవస్థలు పడుతున్నాం.
– మల్లమ్మ, కొత్తగార్లపల్లి, ఊట్కూర్ మండలం
అనుమతి రావాల్సి ఉంది
జిల్లాలోని పలు గ్రామాల నుంచి రేషన్ దుకాణాల ఏర్పాటుపై ఫిర్యాదులు అందుతున్నాయి. దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ప్రతి రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు బియ్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకుంటాం.
– రాంచందర్, ఆర్డీఓ, నారాయణపేట
●
2 కిలోమీటర్లు నడిచి వెళ్తాం


