నంద్యాల మండలాన్ని అభివృద్ధి చేస్తా
నంద్యాల మండలంలో 15 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇందులో వైఎస్సార్‌సీపీ 10 స్థానాల్లో గెలవగా, టీడీపీ 05 స్థానాలకే పరిమితమైంది. వైఎస్సార్‌సీపీ ఎంపీపీగా మోరారెడ్డి శివలలిత అయ్యాలూరు–1 స్థానం నుంచి గెలుపొందారు. పోలూరు ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి గెలుపొందిన బాలచంద్రారెడ్డి వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. ఎంపీపీ భర్త మోరారెడ్డి బసవేశ్వరరెడ్డి పార్టీలో మండలాధ్యక్షడిగా పనిచేస్తున్నారు. గోస్పాడు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్‌సీపీ ఏకంగా 10 స్థానాలను గెలుచుకుంది. టీడీపీ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. మండల ఎంపీపీగా దీబగుంట్ల ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి గెలిచిన పామిరెడ్డి జగదీశ్వరమ్మ ఎంపికయ్యారు. ఈమె కుటుంబ సభ్యుల్లో పార్టీ సీఈసీ మెంబర్ నాగిరెడ్డి ఉన్నారు. వైస్ ఎంపీపీగా జిల్లెల్ల–1 నుంచి గెలుపొందిన మగ్బుల్ హుసేన్ ఎన్నికయ్యారు. ముఖ్యంగా నంద్యాల, గోస్పాడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల గెలుపు విషయంలో నియోజవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి అహర్నిషలు కృషి చేశారు.
● నంద్యాల, గోస్పాడు, పాములపాడు, కొత్తపల్లి, మిడుతూరు ఎంపీపీలుగా
ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు
● పాములపాడులో రచ్చ చేసిన టీడీపీ గూండాలు
● ప్రజాపక్షం వైపే నిలబడిన ఎంపీటీసీ సభ్యులు
● బేతంచెర్ల, డోన్, ప్యాపిలి వైస్ ఎంపీపీ విషయంలో టీడీపీ దౌర్జన్యం
నూతనంగా ఎన్నికై న ఎంపీపీ, వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులతో మాజీ ఎమ్మెల్యే శిల్పారవి
సాక్షి, నంద్యాల: ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ నేతలు ఎన్నో అరాచకాలు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా బెదిరించారు. దాడులు చేసి, నామినేషన్లు చించేసి అక్రమ కేసులు నమోదు చేయించారు. గురువారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నికల్లోనూ ఇదే విధంగా చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయించారు. అయినా వైఎస్సార్‌సీపీ జయకేతనం ఎగురవేసింది. జిల్లాలో 28 ఎంపీపీ స్థానాలు ఉండగా ఐదు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎంపీపీలుగా ఎన్నికయ్యారు. ఎన్నో అబద్ధాలు, లేనిపోని వాగ్దానాలను గుమ్మరించి దొడ్డిదారిలో అధికారంలోకి వచ్చిన చంద్రాబుబు ప్రభుత్వం రెండున్నరేళ్లలో పూర్తిగా విఫలమైంది. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం పూర్తిగా గాలికొదిలేసి రెడ్‌బుక్ రాజ్యాంగం పేరిట అరాచక పాలన చేస్తుండటంతో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారు. జిల్లాలో 141 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించారు. తాజాగా పోలీసులకు అడ్డం పెట్టుకొని ఎంపీపీ ఎన్నికల్లో గెలవాలని చూసిన టీడీపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. బెదిరింపులకు, దాడులకు భయపడకుండా ఎంపీటీసీ సభ్యులు వైఎస్సార్‌సీపీ తరఫున ఎంపీపీలను ధైర్యంగా ఎన్నుకున్నారు.
నందికొట్కూరు నియోజవర్గంలో
మూడు ఎంపీపీలు కై వసం
జిల్లాలో నందికొట్కూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మూడు ఎంపీపీలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంది. కొత్తపల్లి మండలంలో 9 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇందులో 5 వైఎస్సార్‌సీపీ, టీడీపీ 4 గెలుచుకుంది. ఎంపీపీగా ఎర్రమటం ఎంపీటీసీ సెగ్మెంట్ నుంచి గెలిచిన వైఎస్సార్‌సీపీకి చెందిన పెరుగు నాగలక్ష్మిరెడ్డి ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం పార్టీ నియోజకర్గ బూత్ కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. అలాగే దుద్యాల–2 సెగ్మెంట్‌కు గెలిచిన రాజమండ్రి పుల్లయ్య వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు.
● పాములపాడు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా వైఎస్సార్‌సీపీ 6, టీడీపీ5, ఇండిపెండెంట్ ఒకటి గెలిచారు. ఎంపీపీగా పాములపాడు ఎంపీటీసీ స్థానం నుంచి గెలిచిన పరమేశ్వరి ఎన్నికయ్యారు. అలాగే వానాల ఎంపీటీసీ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచిన విజయ్ ప్రతాప్‌రెడ్డి వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. అయితే ఇదంతా నచ్చని టీడీపీ గుండాలు ఎంపీడీవో కార్యాలయం ఎదుట నానా హంగామా సృష్టించారు.
● మిడుతూరు మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 8 వైఎస్సార్‌సీపీ, 4 టీడీపీ గెలుచుకున్నాయి. స్పష్టమైన మెజార్టీ వైఎస్సార్‌సీపీకి ఉండటంతో మిడుతూరు–1 నుంచి గెలిచిన లాజర్ ఎంపీపీగా ఎన్నికయ్యారు. వైస్ ఎంపీపీగా మిడుతూరు–2 నుంచి గెలిచిన తువ్వా లోకేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేయడంలో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ కీలకపాత్ర పోషించారు.
● బేతంచెర్ల, డోన్, ప్యాపిలిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు వైస్ ఎంపీపీలుగా ఎన్నిక కావాల్సి ఉంది. అయితే టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఇందుకు నిరసనగా ప్రమాణ స్వీకారం అనంతరం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యులు వాకౌట్ చేశారు.
ఎంపీపీగా శివలలిత
నంద్యాల(అర్బన్): నంద్యాల మండల నూతన అధ్యక్షురాలుగా మొరారెడ్డి శివలలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయ భవనంలో గురువారం ఎంపీడీఓ అధ్యక్షతన మొదట నూతన ఎంపీటీసీల సమావేశం నిర్వహించి ఎన్నికై న పత్రాలను అందజేశారు. అనంతరం ఎంపీపీ, వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీగా శివలలిత, వైస్ ఎంపీపీగా బాలచంద్రారెడ్డి చేత ఎంపీడీఓ సుగుణశ్రీ, ఆర్వో పార్థసారథిరెడ్డిలు ప్రమాణస్వీకారం చేయించి వారికి కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా జరిగిన మొదటి మండల సమావేశంలో నూతన ఎంపీపీ శివలలిత మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంపీపీ, వైస్ ఎంపీపీలతో పాటు ఎంపీటీసీ సభ్యులను నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి ఎంపీడీఓ కార్యాలయం వద్ద అభినందించారు. ఆయా కార్యక్రమంలో మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ విజయశేఖర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వరరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


