● మాజీ ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్‌బాషా
నంద్యాల(అర్బన్): కర్నూలు–కడప జాతీయ రహదారి సమీపంలోని శాంతిరాం జనరల్ ఆసుపత్రి వద్ద ఉన్న సున్ని మసీదు ఆవరణంలో డిసెంబర్ 17, 18 తేదీల్లో నిర్వహించనున్న దీని ఇస్తెమా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. ఇస్తెమాకు సంబంధించిన ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. అనంతరం ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇస్తెమాకు వచ్చే వారికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు. తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మీల్ అమీర్, గన్నికరీం, సలాముల్లా, జాకీర్ హుస్సేన్, యూనస్, సోహెల్ రాణా, మునెయ్య, మాజీ కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, కలాం, తబ్రేజ్, మజీద్, సాదిక్ బాషా, సమ్మద్, ముస్లిం సంఘాల నాయకులు పాల్గొన్నారు.


