నందికొట్కూరు: పాములపాడు మండలం వానాల ఎంపీటీసీ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డి బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వైఎస్సార్సీపీ కండువా కప్పి సాధారంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఇండిపెండెంట్‌గా ఎంపీటీసీ ఎన్నికల్లో గెలిచారనన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నీతినిజాయితీని చూసి వైఎస్సార్సీపీలో చేరినట్లు తెలిపారు. అనంతరం బైరెడ్డి సిద్ధార్థరెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నాగరాజు, నాయకులు పాల్గొన్నారు.


