కర్నూలు: కోర్టులలోని రాజీ కాదగిన క్రిమినల్, ఎకై ్సజ్ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.వాసు అధికారులకు సూచించారు. న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి లీలా వెంకటశేషాద్రితో కలసి జిల్లా న్యాయ సేవా సదన్‌లో ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాల పోలీసు, ఎకై ్సజ్, ఇన్సూరెన్స్, చిట్‌ఫండ్, బ్యాంకు అధికారులు, న్యాయవాదులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నవంబర్ 21న చెక్‌బౌన్స్ కేసులపై స్పెషల్ లోక్ అదాలత్, డిసెంబర్ 12న జాతీయ లోక్ అదాలత్ ఉన్నందున వాటిలో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించి లోక్ అదాలత్‌ను విజయవంతమయ్యేలా కృషి చేయాలని కోరారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కోర్టులలో ప్రీ లోక్ అదాలత్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కక్షిదారులు తమ కేసులను రాజీపూర్వకంగా పరిష్కరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జ్యుడీషియల్ న్యాయమూర్తులు సంధ్యారాణి, సరోజినమ్మ, అపర్ణ, అనూష, అనిల్‌కుమార్, స్రవంతి పాల్గొన్నారు.


