నంద్యాల(అర్బన్): టీడీపీ మద్దతు దారుడికి ఓట్లు వేస్తేనే పనులు కల్పిస్తామని, లేకపోతే జాబ్ కార్డులు తొలగింపులకు గురవుతాయని నంద్యాల మండలం కొత్తపల్లెలో కొందరు మేటీలు హెచ్చరికలు జారీ చేస్తున్నట్లు సమచారం. వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు అని తెలిస్తే ఉపాధి పనులకు వచ్చే కూలీలకు తక్కువ పనులు కల్పిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడికి ఓట్లు వేయాలనుకునే వారు ఎవరైనా ఉంటే ముందుగానే పనులకు రావద్దని చెబుతున్నట్లు ఉపాధి కూలీలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉండగా చాపిరేవుల గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా పోటీ చేస్తున్న టీడీపీ మద్దతు దారుడు, మరో నాయకుడు విచిత్ర ప్రచారం చేస్తున్నారు. ఓటు వేస్తానని దేవుడిపై ప్రమాణం చేయాలంటూ డిమాండ్ చేస్తుసన్నారు. వైఎస్సార్‌సీపీ మద్దతుదారు కుటుంబాల వద్దకు వెళ్లి ‘మీకు డబ్బులు ఇస్తాం.. ఓటేసేందుకు రావొద్దు’ అంటూ చెబుతున్నారు.
మోడల్ నర్సరీ పనులు
త్వరగా పూర్తి చేయాలి
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
రుద్రవరం: నర్సాపురం వద్ద మోడల్ నర్సరీ పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. ఆళ్లగడ్డ మండలం శాంతినగరం వద్ద డ్రాగన్ తోటలు, సోలార్ కోల్డ్ రూమ్ డ్రైయర్లు, నర్సాపురం వద్ద మోడల్ నర్సరీ పనులను బుధవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉద్యాన రైతులు కేవలం పంటల విక్రయానికి పరిమితం కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ నేర్చుకోవాలన్నారు. రైతులకు నాణ్యమైన మొక్కలు సరఫరా చేసి అవసరమైన అధునాతన సౌకర్యాల కోసం బడ్జెట్ ప్రతిపాదనలు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ జిల్లా అధికారి నాగరాజు, అగ్రికల్చర్ ఏడీ విజయ్‌శేఖర్, వ్యవసాయాధికారులు కిషోర్‌కుమార్‌రెడ్డి, సుమతి పాల్గొన్నారు.


