రాయలసీమకు శాశ్వత జలభద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

రాయలసీమకు శాశ్వత జలభద్రత కల్పించాలి

Nov 7 2026 1:06 AM | Updated on Nov 7 2026 1:06 AM

కర్నూలు కల్చరల్‌: శ్రీశైలం జలాశయాన్ని సమగ్రంగా నిర్వహిస్తూ రాయలసీమకు శాశ్వత జలభద్రత కల్పించేలా ముఖ్యమంత్రి తక్షణ కార్యాచరణ చేపట్టాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను శుక్రవారం కర్నూలులో జలవనరుల శాఖ డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌ మహేష్‌కి సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అందజేసి, సమస్య తీవ్రతను వివరించారు. 2026–27లో ఇప్పటివరకు సుమారు 218 టీఎంసీలు చేరినా నీటి సంరక్షణపై తగిన చర్యలు తీసుకోలేదన్నారు. శ్రీశైలం నుంచి తాగునీటి అవసరాలకే నీటి విడుదలను పరిమితం చేయాలని ఆదేశాలు ఉన్నా.. తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రం నుంచి నీటి విడుదల కొనసాగించిందన్నారు. ఈ నీటిని శ్రీశైలంలోనే నిల్వ ఉంచింటే రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు, మహబూబ్‌నగర్‌, నాగార్జునసాగర్‌ ఆయకట్టు ప్రాంతాల తాగు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడేదన్నారు. రాయలసీమ ప్రజలకు తాత్కాలిక పంట నష్టపరిహారం మాత్రమే కాదు, ప్రతి కరువు సమయంలో తాగునీరు, సాగునీటి కోసం ఆందోళన చెందాల్సిన పరిస్థితి నుంచి శాశ్వత విముక్తి కావాలని ఆయన కోరారు. ఆయన వెంట సమితి ఉపాధ్యక్షులు వాడాల చంద్రశేఖర్‌ రెడ్డి, రామకృష్ణారెడ్డి, నిట్టూరు సుధాకర్‌ రావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement