మల్లన్నను దర్శించుకున్న జగద్గురు పీఠాధిపతి | - | Sakshi
Sakshi News home page

మల్లన్నను దర్శించుకున్న జగద్గురు పీఠాధిపతి

Nov 7 2026 1:06 AM | Updated on Nov 7 2026 1:06 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ పండితారాధ్య శివచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. శుక్రవారం మల్లన్న దర్శనార్థం ఆలయం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి ఆలయ రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, అర్చకస్వాములు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అలాగే ఉభయ దేవాలయాల ప్రధానార్చకులు పూర్ణకుంభంతో పీఠాధిపతికి స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆలయం వద్దగల ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదపండితులు వేదగోష్టి నిర్వహించారు. అధికారులు పీఠాధిపతికి వస్త్ర సమర్పణ చేశారు. చివరిగా పీఠాధిపతి భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement