ఆదర్శ వైద్యులుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

ఆదర్శ వైద్యులుగా ఎదగాలి

Nov 7 2026 1:06 AM | Updated on Nov 7 2026 1:06 AM

కర్నూలు(హాస్పిటల్‌): వైద్య విద్యార్థులు విద్యాభ్యాసం తర్వాత ఆదర్శవంతమైన వైద్యులుగా రాణించాలని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ సూచించారు. శుక్రవారం కర్నూలు మెడికల్‌ కాలేజీలో 2026 బ్యాచ్‌ విద్యార్థులకు 2024 బ్యాచ్‌ విద్యార్థులు ‘ఉత్కర్ష–2026’ పేరుతో ఫ్రెషర్స్‌ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ.. వైద్య విద్యార్థులు అకడమిక్‌ పరిజ్ఞానంతో పాటు క్రమశిక్షణ, నైతిక విలువలు, సేవాభావం, రోగుల పట్ల కరుణ, మానవీయ దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. నిరంతర అధ్యయనం, కృషి, పరిశోధనలతో ఉత్తమ వైద్యులుగా రాణించా లని ఆకాంక్షించారు. వైద్య విద్య పరిశోధనలకు ఈ యేడాది రూ.13 కోట్లు కేటాయించామని, అండర్‌ గ్రాడ్యుయేట్‌ విద్యార్థుల రీసెర్చ్‌ కోసం రూ.3 కోట్లు కేటాయించామని, విద్యార్థులు కోర్సు సమయంలో ఆరు నెలల రీసెర్చ్‌ ప్రాజెక్టు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. యూజీ రీసెర్చ్‌ కోసం 1,600 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో వెయ్యి మందికి మంజూరు చేయను న్నట్లు చెప్పారు. అనంతరం వైద్య విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కేఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కర్నూలు మెడికల్‌ కాలేజీ గొప్పతనాన్ని వివరించారు. వైస్‌ ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ హరిచరణ్‌, డాక్టర్‌ శ్రీరాములు, డాక్టర్‌ సింధియా శుభప్రద, స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీఎస్‌కే ప్రకాష్‌, ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ లక్ష్మిబాయి, ఉమెన్స్‌ హాస్టల్‌ వార్డెన్‌ డాక్టర్‌ మాధవీశ్యామల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement