ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ఉపసంహరణ పర్వం
అధికారికంగా బీ–ఫారాలు సమర్పించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు
పలు మండలాల్లో రాత్రి పొద్దుపోయే వరకు తుది జాబితా ప్రకటించని వైనం
ఏం జరుగుతుందోనని అభ్యర్థుల ఆందోళన
రాత్రి 10 గంటలకూ ప్రకటించని జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితా
ఆళ్లగడ్డ: స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణతో జిల్లాలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. చివరి నిమిషం వరకు కొనసాగిన చర్చలు, నజరానాలు, బెదిరింపుల పర్వానికి తెరపడింది. ఇక పోటాపోటీగా ప్రచారానికి సిద్ధం కానున్నారు. జిల్లాలోని 28 మండ లాల్లో మంగళవారం సాయంత్రం 3 గంటలకే ఉప సంహరణ ప్రక్రియ పూర్తయినా దాదాపు 10 మండలాల్లో ఎన్నికల అధికారులు రాజకీయ ఒత్తిడితో రాత్రి పొద్దుపోయే వరకు బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించ లేదు. ఎంత మంది పోటీ లో ఉన్నారో కూడా ప్రకటించకుండా అలాగే కూర్చున్నారు. చివరకు చేసేదేమి లేక రాత్రి పొద్దుపోయాక అధికారులు కార్యాలయాలకు తాళాలు వేసి వెళ్లడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఏం జరిగిందని తెలిసిన వారిందరికీ ఫోన్‌లు చేస్తూ కాలం వెళ్లదీయాల్సి వచ్చింది. జిల్లాలో 28 జెడ్పీటీసీలు ఉండగా 8 స్థానాలు టీడీపీ, ఒక స్థానం వైఎస్సార్‌సీపీకి ఏకగ్రీవమయ్యాయి. ప్యాపిలి వైఎస్సార్‌సీపీ గెలుపొందగా బనగానిపల్లె, కోవెలకుంట్ల, అవుకు, కొలిమిగుండ్ల, సంజామల, వెలుగోడు, బేతంచర్ల, ఉయ్యాలవాడ స్థానాలు టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. ఇక మిగిలిన 19 స్థానాలకు ఎన్నికల జరగాల్సి ఉంది. అయితే బరిలో ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను జిల్లా ఉన్నతాధికారులు ప్రకటించలేదు. అలాగే జిల్లాలో మొత్తం 377 ఎంపీటీసీ స్థానా లు ఉన్నాయి. అయితే ఆళ్లగడ్డ, పాణ్యం నియోజవకర్గంలో ఏకపక్షంగా ఏకగ్రీవాలకు ప్రయత్నిస్తుండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు తుది జాబితాను ప్రకటించలేదు.
ఫలించని పోలీసుల ప్రయత్నం..
ఆళ్లగడ్డ నియోజవర్గంలోని 6 జెడ్పీటీసీ, 6 ఎంపీపీలతో పాటు 71 ఎంపీటీసీ స్థానాలకు రాజీ చేస్తామ ని సీఐ, ఎస్‌ఐలు పాలక, ప్రతిపక్ష నాయకుల ఇళ్ల చుట్టు మూడు రోజులుగా తిరిగారు. ప్రధాన అభ్యర్థుల మధ్య రాజీ చేసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. చివరిగా ఆళ్లగడ్డలో రాజీ కుదిరింది.. అని జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగింది. కాసేపట్లో ఉప సంహరణలు ఉంటాయని అందరు అనుకున్నారు. అయి తే ఏం జరిగిందో తెలియదు. పోలీస్ అధికారులు అటు ఇటు తిరుగుతున్నారే తప్ప.. రాత్రి పొద్దుపోయే వరకు ఓ కొలిక్కి రాలేదు. ఎన్నికల అధికారులు, సిబ్బ ంది కార్యాలయంలో కూర్చున్నారు. ఎన్నికల నిబంధనల మేరకు సాయంత్రంలోగా అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాల్సి ఉంది. అభ్యర్థులకు గుర్తులు సైతం కేటాయించాల్సి ఉంది. అయితే ఎన్నికల అధికా రులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అర్ధరాత్రి వరకు జాబితా ప్రకటించ లేదనే విమర్శలు ఉన్నాయి.
మంగళవారం సాయంత్రం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసినప్పటికీ జిల్లాలో అనేక మండలాల్లో రాత్రి పొద్దుపోయేవరకు తుది జాబితాను అధికారులు బయటకు వెల్లడించకపోవడం తీవ్ర కలకలం రేపింది. అధికార టీడీపీ తమ అభ్యర్థులకు ప్రత్యర్థులుగా బరిలో నిలిచిన తిరుగుబాటు అభ్యర్థులతో పాటు వైఎస్సార్‌సీపీ, ఇతరులను నయోనో భయానో ఉపసంహరించుకునేలా చేయాలన్న చర్చలు అనేక చోట్ల ఫలించలేదు. దీంతో ఎట్టకేలకు ప్రత్యక్ష పోరు ఖాయమైంది. పార్టీల నుంచి అధికారికంగా బీ – ఫారం అందిన అభ్యర్థులకు సంబంధిత ఎన్నికల గుర్తులను అధికారులు కేటాయించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కొన్ని ఆర్వో కార్యాలయాల్లో పోలీసులు బయట ఉండగా అధికారులు లోపల ఉండి తాళాలు వేసుకుని ఉన్నట్లు కూడా తెలుస్తోంది. కొందరు సమయం అయిపోయింది పోతామంటే లేదు మేము.. మాట్లాడుతున్నాం ఉండండి ఏకగ్రీవాలు చేద్దామని పోలీసులు అధికారులు హుకుం జారీ చేయడంతో చేసేది లేక అధికారులు అలాగే కూర్చున్నారు. కొందరు అధికారులు తమకు పరిచయమున్న నాయకులకు ఫోన్ చేసి చేసేదేదో తొందరగా చేసుకోండి అని బతిమాలడటం గమనార్హం. దొర్నిపాడు ఆర్‌ఓ కార్యాలయంలో అదే పరిస్థితి నెలకొంది. బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలు రాత్రి వరకు ప్రకటించలేదు.


