పింఛన్ల పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

పింఛన్ల పంపిణీకి పటిష్ట ఏర్పాట్లు

Oct 28 2026 12:36 AM | Updated on Oct 28 2026 12:36 AM

నంద్యాల(న్యూటౌన్‌): నవంబర్‌ 1న పట్టణ, స్థానిక సంస్థల ఎన్నికలు, 3న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో పింఛన్ల పంపిణీకి ఎలాంటి ఆటంకాలు కలగకుండా పటిష్టమైన ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమ తి మేరకు ఈనెల 30వ తేదీన పింఛన్ల పంపిణీ చేపట్టాలని, ఈ మేరకు ఈనెల 29న నగదు ఉప సంహరణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత రీజినల్‌ మేనేజర్లు, లీడ్‌ జిల్లా మేనేజర్లు, బ్యాంక్‌ శాఖల్లో తగినంత నగ దు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. నగదు కొరత కారణంగా పింఛన్‌దారులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, అన్ని శాఖల అఽధికారులు సమన్వయంతో పని చేస్తూ పింఛన్ల పంపిణీ సజావుగా చేపట్టాలన్నారు.

నేటి నుంచి పోస్టల్‌ బ్యాలెట్‌

నంద్యాల(అర్బన్‌): నంద్యాల పురపాలక సంఘం ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అర్హులైన ఉద్యోగులు ఈనెల 28, 29 తేదీల్లోగా పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు స్థానిక కార్యాలయంలో ఫెషిలిటేషన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసినట్లు కమిషనర్‌ శేషన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటు న్న ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఎన్నికల విధుల నియామక ఉత్తర్వుల జీరాక్స్‌ కాపీ, ప్రభుత్వ గుర్తింపు ఐడీ కార్డు, ఫారం ఎక్స్‌–ఏ దరఖాస్తు ఫారాలతో రావాలన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేసేటప్పుడు నంద్యాల మున్సి పాలిటీ లో గజిటెడ్‌ సంతకం చేసేందుకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.

ప్రకటనలకు ఎంసీఎంసీ

ధ్రువీకరణ తప్పనిసరి

కర్నూలు(సెంట్రల్‌): స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సోషల్‌ మీడియాలో రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఇచ్చే ప్రకటనలకు ముందస్తుగా ఎంసీఎంసీ ధ్రువీకరణను తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.సిరి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం కర్నూలు కలెక్టరేట్‌లోని సీపీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ సెల్‌ను సంప్రదించాలని ఆమె సూచించారు. అనుమతి తీసుకోకుండా ప్రచారం చేస్తున్న అభ్యర్థులకు సంబంధిత ఆర్వోల ద్వారా నోటీసులు జారీ చేస్తామన్నారు.

నేడు వీబీజీ రామ్‌జీపై సమీక్ష

కర్నూలు(అగ్రికల్చర్‌): వీబీ జీ రామ్‌ జీ కార్యక్రమాలపై ఈ నెల 28న ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరుగనుంది. సమావేశానికి గ్రామీణాభివృద్ధి శాఖ అడిషనల్‌ కమిషనర్‌ ఎం.శివప్రసాద్‌ పర్యవేక్షణాధికారిగా హాజరు కానున్నారు. ఉదయం 10 నుంచి 1 గంట వరకు నంద్యాలలో.. మధ్యాహ్నం 3 గంటల నుంచి కర్నూలులోని జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో సమీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌ నరసింహారెడ్డి తెలిపారు. సమావేశాలకు టెక్నికల్‌ అసిస్టెంట్లు మొదలు కొని ఏపీవో, ఏపీడీ వరకు పూర్తి స్థాయి వివరాలతో హాజరు కావాలన్నారు.

ఖైదీలు తమ హక్కులు తెలుసుకోవాలి

ఆదోని రూరల్‌: జైలులోని ఖైదీలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని సబ్‌జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖైదీలకు ఎవరికై నా న్యాయవాదులు లేకుంటే ఉచితంగా న్యాయవాదిని నియమిస్తామన్నారు. 70 ఏళ్ల వయస్సు పైబ డిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడే వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. ఖైదీలను కోర్టులకు కచ్చితంగా హాజరు చేయా లని ఆదేశించారు. లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ 15100పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎల్‌ఏడీసీ శివకుమార్‌, జైలు సూ పరింటెండెంట్‌ నజీర్‌అహమ్మద్‌, జైలు విజిటింగ్‌ అడ్వకేట్‌ బి.నవీన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement