మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

Oct 28 2026 12:36 AM | Updated on Oct 28 2026 12:36 AM

నంద్యాల(న్యూటౌన్‌): ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల (సూక్ష్మపరిశీలకులు) పాత్ర కీలకమని, పోలింగ్‌ సమయంలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని జేసీ సూరజ్‌ధనుంజయ్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో మున్సిపాలిటీ, నగర పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియపై మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించేలా మైక్రో అబ్జర్వర్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం చేపట్టాల్సిన విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల పరిసరాల్లో పరిస్థితులు, ఓటర్లకు కల్పించిన సదుపాయాలు, బలహీన వర్గాల ఓటర్లపై ఒత్తిళ్లు లేదా ఆధిపత్య ధోరణి ఎన్నికల ప్రవర్తన నియవాళి అమలు వంటి అంశాలను పరిశీలించాలన్నారు. పోలింగ్‌ ప్రారంభానికి ముందు బ్యాలెట్‌ బాక్స్‌ను ఖాళీగా చూపించడం, సీలింగ్‌ ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించడం, పోలింగ్‌ ఏజెంట్ల హాజరు, ఎన్నికల సామగ్రి పంపిణీ అంశాలను పరిశీలించాలన్నారు. సమావేశ ంలో డీఆర్‌ఓ రాముమ్‌నాయక్‌, ఎల్‌డీఎం అయ్యపు రెడ్డి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement