హామీలు నెరవేర్చి ఓట్లు అడగాలి | - | Sakshi
Sakshi News home page

హామీలు నెరవేర్చి ఓట్లు అడగాలి

Oct 28 2026 12:36 AM | Updated on Oct 28 2026 12:36 AM

కూటమి నేతలు ప్రజలను మళ్లీ మభ్యపెట్టలేరు

వైఎస్సార్‌సీపీ హయాంలోనే అభివృద్ధి

వాటర్‌ గ్రిడ్‌ పథకంతో బేతంచెర్ల దాహం తీరింది

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

బేతంచెర్ల: సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతనే కూటమి నేతలు ఓట్లు అడగాలని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా అభివృద్ధి చేయలేదన్నారు. బేతంచెర్ల నగర పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బుగ్గానిపల్లెలోని 4,5 వార్డుల వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు మద్దయ్య, రంగస్వామితో పాటు చైర్మన్‌ అభ్యర్థి దూదేకుల దస్తగిరితో కలిసి మాజీ మంత్రి బుగ్గన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారన్నా రు. బస్సులు లేని ఉచిత బస్సు పథకంతో ప్రజలకు ఏమి లాభమని, బస్సుల కొరతతో ప్రయాణం నరకంగా మారుతుందన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ హయాంలో కొంత పింఛన్లు మంజూరు చేయడంతో పాటు ప్రతి మూడు నెలలకు ఓ సంక్షేమ పథకం ద్వారా కుటుంబాలకు లబి ్ధచేకూర్చామని తెలిపారు. 10 ఏళ్ల క్రితం మూత పడిన పాణ్యం సిమెంట్‌ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించామన్నారు. గత ఎన్నికల్లో తాము అధికారంలోకి వచ్చి ఉంటూ ఉత్పత్తిని 80 వేల టన్ను ల నుంచి 3 లక్షల టన్నుల వరకు పెంచే లక్ష్యం ఉండేదన్నారు. టీడీపీ నాయకుల జోక్యంతో ఫ్యాక్టరీలో తరచూ ఉత్పత్తి నిలిచిపోతుందని, వారి అక్రమ సంపా దన కోసం ఫ్యాక్టరి గేటుకు తాళం వేసి ఆందోళన చేయలేదా అని ఆరోపించారు.

వాల్మీకి భవనం ఎందుకు పూర్తి చేయలేదు..

హెచ్‌ కొట్టాలలో గత ప్రభుత్వ హయాంలో 90 శాతం పూర్తయిన వాల్మీకి కమ్యూనిటీ భవనాన్ని కూటమి ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేదని బుగ్గన ప్రశ్నించారు. అభివృద్ధి పనులు కొనసాగించ కుండా నిలిపివేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో గ్రామీణ రహదారులు బేతంచెర్ల నుంచి డోన్‌, నంద్యాల, కర్నూలు రహదారు విస్తరణ, రూ. 650 కోట్లతో జాతీయ రహదారి, రూ 350 కోట్లతో గోరుకల్లు నుంచి వాటర్‌ గ్రిడ్‌ పథకం ద్వారా తాగునీటి సరఫరా చేపట్టామన్నారు. ఈ పథకం లేకపోతే ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో బేతంచెర్ల పట్టణంలో తీవ్ర తాగునీటి సమస్య ఏర్పడేదన్నారు. కార్యక్రమంలో మాజీ నగర పంచాయతీ చైర్మన్‌ చలం రెడ్డి, నాయకులు నాగ వెంకటేశ్వర్లు, మధు, జయరాముడు, శ్రీను, మధు, పట్టణ కన్వీనర్‌ జాకీర్‌ హుసేన్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement