పుడమి తల్లికి లేఖ రాద్దాం రండి | - | Sakshi
Sakshi News home page

పుడమి తల్లికి లేఖ రాద్దాం రండి

Sep 12 2026 1:54 AM | Updated on Sep 12 2026 1:54 AM

అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో ఉన్న

పోస్టాఫీసుల వివరాలు..

నంద్యాల(న్యూటౌన్‌): సోషల్‌ మీడియా రాకతో ఉత్తరం ఇప్పుడు చుట్టం చూపు అవుతుంది. నేటి తరానికి అసలు ఉత్తరం ఊసే తెలియకపోగా పాత తరం ఉత్తరం ఊసులు మర్చిపోతుంది. అందుకే ఉత్తరాన్ని గుర్తు చేసేందుకు పోస్టల్‌ శాఖ ’దాయ్‌ ఆఖర్‌’ కార్యక్రమాన్ని ఏటా దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ ఏడాది ‘భూమాతకు ఒక లేఖ– ప్రకృతిని రక్షించడానికి నా వాగ్దానం’ అంశంపై లేఖలను ఆహ్వానిస్తోంది. 18 ఏళ్లలోపు వారు ఒక కేటగిరీగా, 18 ఏళ్లు పై బడిన వారిని మరొక కేటగిరీగా పరిగణిస్తారు. విజేతలకు నాలుగు కేటగిరీల్లో మొత్తం 12 బహుమతులు అందిస్తారు. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ లేదా పైబడి ఉన్నారని తెలియజేస్తూ ధ్రువీకరణ పత్రాన్ని జతపరిచాలి. లేఖను తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో రాసి అక్టోబరు 31వ తేదీలోగా నిర్ణీత చిరునామాకు పంపాల్సి ఉంటుంది.

నగదు బహుమతులు ఇలా..

ఉత్తమ లేఖలను ఎంపికచేసి మొదటి, ద్వితీయ, తతీయ బహుమతులు అందజేస్తారు. మొదటి బహుమతికి రూ. 25 వేలు (రాష్ట్ర స్థాయి) రూ.50 వేలు (జాతీయ స్థాయి), రెండవ బహుమతికి రూ.10 వేలు (రాష్ట్ర స్థాయి), రూ25 వేలు (జాతీయ స్థాయి), మూడవ బహుమతికి రూ. 5 వేలు (రాష్ట్ర స్థాయి), రూ.10 వేలు (జాతీయ స్థాయి) అందిస్తారు.

ఎలా రాయాలంటే..

ఎన్వలప్‌ కవర్‌లో పంపాలనుకునే వారు ఏ–4 సైజ్‌ పేపర్‌పై 1000 పదాలకు మించకుండారాసి పంపాలి. ఇన్‌ల్యాండ్‌ లెటర్‌ కార్డుపై రాసే వారు 500 పదాలకు మించకుండా రాయాల్సి ఉంటుంది. లేఖలను రాసిన నంద్యాల జిల్లా వారు ఎస్పీవోఎస్‌, నంద్యాల డివిజన్‌ అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది.

ప్రజలు అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలి. ఉత్తరాలపై ప్రజలకు, ఈ తరం వారికి తెలి యజేసేందుకు పోస్టల్‌ శాఖ దేశ వ్యాప్తంగా దాయ్‌ ఆఖరును నిర్వహిస్తోంది. ప్రోత్సాహకంగా నగదు బహుమతులు కూ డా అందజేస్తుంది. అక్టోబరు నెలాఖరుతో గడువు ము గుస్తుంది. ఆసక్తి ఉన్నవారు నిర్ణీత పదాల్లో లేఖను రాసి లేఖలను పంపాలి. నిర్ణీత తేదీ తర్వాత వచ్చే లేఖలను స్వీకరించం. – అప్పన్నస్వామి,

పోస్టల్‌ సూపరింటెండెంట్‌, నంద్యాల

హెడ్‌ పోస్టాఫీసులు 1

సబ్‌ పోస్టాఫీసులు 457

బ్రాంచి పోస్టాఫీసులు 283

జాతీయ స్థాయిలో తపాలాశాఖ

లేఖా రచన పోటీలు

‘దాయ్‌ ఆఖర్‌’ పేరుతో లేఖల ఆహ్వానం

అక్టోబర్‌ 31 వరకు అవకాశం

విజేతలకు రూ. 50 వేల వరకు

నగదు బహుమతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement