ఖరీఫ్ సీజన్ దాదాపుగా చివరి దశకు వచ్చింది. కాల్వలకు నీరు విడుదల చేసి ఉంటే అంతో ఇంతో పంటలు చేతికందేవి. సాగునీరు అందకపోవడంతో పంటలన్నీ దెబ్బతిన్నాయి. పెట్టుబడిలో పైసా కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదు. ఈ ఖరీఫ్ సీజన్ రైతులకు అప్పులే మిగిల్చింది. – గోపాల్‌రెడ్డి, రైతు
ఏటా వరి, మొక్కజొన్న తదితర పంటలతో వ్యవసాయం కళకళలాడేది. ఈ ఏడాది గతంలో ఎన్నడూ లేనంతగా కరువు దాపురించింది.ఎటు చూసి నా బీళ్లే కనిపిస్తున్నాయి. బోర్లు, కాల్వల కింద సాగు చేసిన పంటలకు నీరందక రైతులు దున్నేస్తున్నారు. కూటమి ప్రభుత్వం నంద్యాలను కరు వు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి.
– మార్క్, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు


