● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల (న్యూటౌన్): రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ రాజకుమారి రెవెన్యూ ఆదేశించారు. మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్‌తో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు. 22ఏ నిషేధిత భూముల జాబితా, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ, రీ–సర్వే, రెవెన్యూ–1 సేవలు, హౌసింగ్ ఫర్ ఆల్, భూసేకరణ, పీజీఆర్‌ఎస్, ఐవీఆర్‌ఎస్, ఓఆర్‌సిఎంఎస్ తదితర అంశాలపై పురోగతిని సమీక్షించారు. ప్రతి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల పూర్తి వివరాలు రెవెన్యూ అధికారుల వద్ద ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నారు. యానిమల్ కాంప్లెక్స్, వెల్‌నెస్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు తదితర భవనాలకు భూములను ముందుగానే గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ ట్రాక్ ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించి, 15 రోజుల్లో ప్రతిపాదనలు పంపాలని పాణ్యం తహసీల్దార్‌ను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, ల్యాండ్ అండ్ సర్వే ఏడీ శ్రీరామ్, ఆర్డీఓలు, అన్ని మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


