మద్యం షాపుల లైసెన్సు మరో ఏడాది పునరుద్ధరించండి | - | Sakshi
Sakshi News home page

మద్యం షాపుల లైసెన్సు మరో ఏడాది పునరుద్ధరించండి

Sep 10 2026 1:33 AM | Updated on Sep 10 2026 1:33 AM

కర్నూలు (టౌన్‌): మద్యం షాపుల లైసెన్సుల గడువు ఈ నెల 30న ముగుస్తున్నందున మరో ఏడాది పాటు రెన్యూవల్‌ చేయించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీదేవి స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయంలో కర్నూలు, నంద్యాల జిల్లాల స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్‌ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాలను నాటుసారా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నాటుసారా తయారు చేయకుండా పాత నేరస్తులపై నిఘా ఉంచాలని వారందరినీ సంబంధిత తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేయాలని ఆదేశించారు. పొరుగు రాష్ట్రాల మద్యం, నకిలీ మద్యం జిల్లాలోకి ప్రవేశించకుండా పాత నేరస్థులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాల మద్యం కేసుల్లో, గ్రేవ్‌ క్రైం కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి అరెస్టు చేయకుండా ఉన్న పెండింగ్‌ కేసుల ముద్దాయిలను సత్వరమే అరెస్టు చేయాలని దర్యాప్తు అనంతరం చార్జ్‌షీటు కోర్టుకు సమర్పించాలని ఆదేశించారు. ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావు, ఎకై ్సజ్‌ అధికారి సుధీర్‌ బాబు (కర్నూలు), రవికుమార్‌ (నంద్యాల), ఏఈఎస్‌లు రాజశేఖర్‌ గౌడ్‌, రామకృష్ణారెడ్డి, విజయకుమార్‌, కర్నూలు, నంద్యాల ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement