శ్రీశైల క్షేత్ర సందర్శనకు వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసే అతిథులను గౌరవించడం కోసం మాత్రమే కొన్ని ప్రత్యేక వంటకాలు సిద్ధం చేస్తాం. వంటకాలలో నిషేధిత వస్తువులైన ఉల్లి, వెల్లుల్లి వినియోగించే ప్రసక్తే లేదు. మహాశివరాత్రి, ఉగాది ఉత్సవాలకు తరలివచ్చే జిల్లా అధికారుల బృందానికి, సిబ్బందికి ప్రత్యేకంగా వంట మనుషులను, ప్రత్యేక పొయ్యి ఏర్పాటు చేసి వంటలు సిద్ధం చేస్తాం. భక్తులకు సిద్ధం చేసే అన్నప్రసాదం పవిత్రంగా తయారు చేస్తాం. త్వరలో అతిథుల కోసం దేవస్థాన అన్నప్రసాద భవనం కాకుండా ప్రత్యేక వంటశాలను ఏర్పాటు చేసి, చెఫ్, వడ్డనకు మనుషులను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉంది. – ఎం.శ్రీనివాసరావు,
శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి


