శ్రీశైలం హుండీ ఆదాయం రూ.5.88కోట్లు | - | Sakshi
Sakshi News home page

శ్రీశైలం హుండీ ఆదాయం రూ.5.88కోట్లు

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

శ్రీశైలంటెంపుల్‌: భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపేణా రూ.5,88,89,846 లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆలయంలోని అలంకార మండపంలో ఉభయ దేవాలయాల్లోని హుండీలలో గత 35రోజులల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. బంగారం 87గ్రాముల 200 మిల్లీగ్రాములు, వెండి 4కేజీల 250 గ్రాములు లభించినట్లు ఈఓ తెలిపారు. అలాగే యుఎస్‌ఏ డాలర్లు 540, యుఏఇ దిర్హమ్స్‌ 1610, సింగపూర్‌ డాలర్లు 20, ఇంగ్లాండ్‌ పౌండ్స్‌ 140, మలేషియా రింగిట్స్‌ 21, సౌదీరియాల్స్‌ 10, బహ్రైన్‌దినార్‌ 109, ఓమన్‌బైసా 100, ఓమన్‌ రియాల్స్‌ 5 లభించినట్లు ఈఓ తెలిపారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపు చేపట్టారు. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేష్‌నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు కె.కాంతివర్ధిని, ఉప్పుటూరి సుబ్బలక్ష్మి, పి.యు.శివమ్మ, పలు విభాగాల యూనిట్‌ అధికారులు, పర్యవేక్షకులు, శివసేవకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement