జగదుర్తిలో టీడీపీ నాయకుల రౌడీయిజం | - | Sakshi
Sakshi News home page

జగదుర్తిలో టీడీపీ నాయకుల రౌడీయిజం

Aug 27 2026 1:30 AM | Updated on Aug 27 2026 1:30 AM

వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడి

ఐదుగురుకి గాయాలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ నాయకులు తిరగకుండా ఉండేందుకు టీడీపీ నాయకులు రౌడీయిజం చేశారు. డోన్‌ మండలం జగదుర్తిలో బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడి చేశారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రాజేశ్వరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సోమశేఖర్‌రెడ్డి, కోదండరామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డితో పాటు మరి కొంత మంది పట్టుడు కర్రలతో దాడి చేసినట్లు గాయపడిన వారు తెలిపారు. వైఎస్‌స్రా్‌సీపీ నాయకులు మోహన్‌రెడ్డి, రఘునాథరెడ్డి, ఉప్పరి వెంకటేశ్వర్లు, బోయ సుంకన్న, బోయ సురేష్‌ ఇళ్లకు వెళ్లి దాడి చేసినట్లు బాధిత కుటుం సభ్యులు తెలిపారు. దాడిలో మోహన్‌రెడ్డి, రఘునాథరెడ్డి తలలకు బలమైన తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన ముగ్గురికి గాయాలు కావడంతో వీరిని గ్రామస్తులు డోన్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న రూరల్‌ పోలీసులు గ్రామానికి వెళ్లి పరిస్థతిని సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement