ఓర్వకల్లులో ఫైర్‌ స్టేషన్‌ స్థల పరిశీలన | - | Sakshi
Sakshi News home page

ఓర్వకల్లులో ఫైర్‌ స్టేషన్‌ స్థల పరిశీలన

Aug 22 2026 2:05 AM | Updated on Aug 22 2026 2:05 AM

ఓర్వకల్లులో ఫైర్‌ స్టేషన్‌ స్థల పరిశీలన

కర్నూలు: ఓర్వకల్లులో ఫైర్‌ స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఆ శాఖ డీజీ వెంకట రమణ పరిశీలించారు. శుక్రవారం విజయవాడ నుంచి ఆయన కర్నూలు చేరుకోని జిల్లా అధికారులతో కలిసి ఓర్వకల్లు తహసీల్దారు కార్యాలయం ఎదురుగా ఉన్న 60 సెంట్ల స్థలాన్ని పరిశీలించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఫైర్‌ స్టేషన్‌ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. ఈ ప్రాంతం ఇండిస్ట్రియల్‌ హబ్‌గా మారుతున్నందున అందుబాటులో ఫైర్‌ స్టేషన్‌ ఉండేందుకు వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని డీజీ వెంకట రమణ జిల్లా అధికారులకు సూచించారు. ఆయన వెంట రీజినల్‌ ఫైర్‌ ఆఫీసర్‌ భూపాల్‌ రెడ్డి, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ బాలరాజు, అసిస్టెంట్‌ ఫైర్‌ ఆఫీసర్‌ బజారి, నంద్యాల జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ శంకర్‌ ప్రసాద్‌, తదితరులు ఉన్నారు.

విధుల నుంచి సీఎస్‌ఓ తొలగింపు

శ్రీశైలం టెంపుల్‌: శ్రీశైల దేవస్థానం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాసరావును విధుల నుంచి తొలగిస్తూ శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీశైలం సీఐ, దేవస్థానం చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ మధ్య ఫోన్‌ సంభాషణ వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఫోన్‌ సంభాషణ వివాదంపై ఈఓ అంతర్గత విచారణ చేయించారు. దేవస్థాన నిబంధనలు అతిక్రమించి ఫోన్‌ ఆడియో లీక్‌ చేసి దేవస్థాన ప్రతిష్టకు భంగం కలిగించారనే కారణంతో సీఎస్‌ఓ బి. శ్రీనివాసరావుపై దేవస్థాన ఈఓ వేటు వేశారు. ఇంచార్జీ సీఎస్‌ఓగా పర్యవేక్షకులు మల్లికార్జునకు బాధ్యతలు అప్పగించారు.

పెట్టుబడి మట్టిపాలు

నందికొట్కూరు: ఎల్‌నినో దెబ్బకు తొమ్మిది ఎకరాల మినుము పంటను రైతు ఆండ్రడ్డి వెంకటరెడ్డి శుక్రవారం దున్నేశారు. జూలై నెల మొదటి వారంలో మినుము పంటను రైతు సాగు చేశారు. మూడు ఎకరాలు సొంత భూమి, ఆరు ఎకరాలు భూమిని రూ. 20 వేల చొప్పున కౌలుకు తీసుకొని రైతు సా గు చేశారు. ఒక ఎకరాకు రూ. 26 వేలు ఖర్చు వచ్చిందని, తొమ్మిది ఎకరాలకు వెచ్చించిన పెట్టుబడి రూ.2.34 లక్షలు మట్టిపాలు అయ్యిందని తెలిపారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement