మంత్రి నియోజకవర్గంలో ‘ఆట’గాళ్లు! | - | Sakshi
Sakshi News home page

మంత్రి నియోజకవర్గంలో ‘ఆట’గాళ్లు!

Aug 22 2026 2:11 AM | Updated on Aug 22 2026 2:11 AM

మంత్రి నియోజకవర్గంలో ‘ఆట’గాళ్లు!

జడలువిప్పిన అందర్‌బాహర్‌

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బనగానపల్లె నియోజకవర్గంలోని సంజామల, కొలిమిగుండ్ల మండలాలు పేకాట స్థావరాలుగా వెలుగొందుతున్నాయి. 2024లో సంజామల మండలంలో పోలీసులు జరిపిన మెరుపు దాడుల్లో 80 మందిని అరెస్ట్‌ చేసి రూ.83,520 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2025లో 10 కేసులు నమోదు చేసి 61 మందిని అరెస్ట్‌ చేసి రూ.63,410 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026లో రెండు కేసులకు సంబంధించి 8 మందిని అరెస్ట్‌ చేసి రూ.15,550 నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కొలిమిగుండ్ల మండలంలో రెండేళ్లలో 11 కేసులు నమోదయ్యాయి. కనకాద్రిపల్లి, కల్వటాలలో టీడీపీ నేతలు పేకాట కేంద్రాలు నిర్వహిస్తున్నారు.

ఆదోని ప్రాంతంలో పేకాట జోరుగా సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడుకు చెందిన జిన్నింగ్‌మిల్లు ప్రాంతంలో పెద్ద ఎత్తున పేకాట స్థావరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆలూరు, ఆదోని నియోజకవర్గాల పరిధిలోని కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో గ్రామగ్రామాన పేకాట విచ్చలవిడిగా సాగుతోంది. పేకాట నిర్వాహకులు టీడీపీ నేతలతోపాటు పోలీసులకు వారం వారం మూమూళ్లు ముట్టజెబుతున్నట్లు సమాచారం.

మార్చి 15వ తేదీన ఆస్పరి మండలం చిన్నహోతూరు సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై కర్నూలు స్పెషల్‌ పార్టీ పోలీసులు దాడులు నిర్వహించి రూ.5.30 లక్షల నగదు, 17 సెల్‌ఫోన్‌లు, 8 బైక్‌లు స్వాధీనం చేసుకొని 18 మందిపై కేసు నమోదు చేశారు. ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో వివిధ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న 16 మందిపై కూడా స్పెషల్‌ పార్టీ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఉమ్మడి జిల్లాలో నమోదైన కేసులు కొన్ని..

కోసిగిలో 2025 సంవత్సరంలో 12 పేకాట కేసుల్లో 48 మందిని అరెస్టు చేసి రూ.62,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు ఆరు పేకాట కేసులు నమోదు చేసి 18 మంది అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.24,800 స్వాధీనం చేసుకున్నారు.

మంత్రాలయం మండలం మాధవరం పోలీసు స్టేషన్‌ పరిధిలో 2025లో 19 మందిపై కేసులు నమోదు చేసి రూ.14,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2026లో రెండు కేసుల్లో 32 మందిని అరెస్టు రూ.1,73,950 స్వాధీనం చేసుకొని ఆరు బైక్‌లను సీజ్‌ చేశారు. 2026లో ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు రూ.26,700 స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం పోలీసు స్టేషన్‌ పరిధిలో 2025లో మందిని అరెస్టు చేసి రూ.28,860 నగదును స్వాఽధీనం చేసుకోగా.. 2026లో మరో 8 మందిపై కేసులు నమోదు చేసి రూ.20 వేలను స్వాధీనం చేసుకున్నారు.

కృష్ణగిరి మండలంలో 2025 సంవత్సరంలో మూడు కేసుల్లో 18 మందిని అరెస్టు చేసి రూ.34,630 నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఎమ్మిగనూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో 2025లో 16 కేసుల్లో 87 మందిపై కేసు నమోదు చేసి రూ.1,93,935 నగదును స్వాధీనం చేసుకున్నారు. 2026లో ఏడుగురిపై కేసు నమోదు చేసి రూ.17,230 స్వాధీనం చేసుకున్నారు.

ఉమ్మడి జిల్లాలో విచ్చలవిడిగా

పేకాట స్థావరాలు

కర్నూలు నగరంలోని

అద్దె భవనాల్లో నిర్వహణ

చర్చనీయాంశంగా

ఓ మొబైల్‌ వాహనం

అడ్డాగా మారిన

మంత్రి బీసీ నియోజకవర్గం

ఆటగాళ్లకు ఆహ్వానం పలుకుతున్న

కుందూతీరం

ప్రత్యేక వాహనాల్లో కర్ణాటకలోని

రాయచూరుకు..

పచ్చ నేతల అండతో

మితిమీరిన జూదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement