కర్నూలు(సెంట్రల్): ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. వి.గిరికుమార్‌రెడ్డి ప్యానల్ మాత్రమే పోటీకి దిగడంతో ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్ష, కార్యదర్శులుగా వి.గిరికుమార్‌రెడ్డి, ఎం.వెంకటరాజులు ఎంపికయ్యారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ అసోసియేషన్ భవన్‌లో ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా అధ్యక్షుడు దివాకరరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారిగా అనంతపురం జిల్లా ట్రెజరర్ పునీత్, అబ్జర్వర్‌గా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోమశేఖర్ వ్యవహరించారు. వి.గిరికుమార్‌రెడ్డి ప్యానల్ అన్ని స్థానాలకు పోటీకి దిగింది. అయితే జిల్లా పౌరసరఫరాల శాఖలో పనిచేస్తున్న వెంకటేశ్వరరెడ్డి మాత్రమే జిల్లా అధ్యక్ష స్ధానానికి పోటీ చేశారు. ఆయన తిరిగి తన నామినేషన్‌ను వెనక్కి తీసుకోవడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.


