నీరు లేక ఒట్టిపోయిన హంద్రీ నది
గోరంట్ల గ్రామంలో నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారం కోసం ఇటీవల ఇరిగేషన్ అధికారులు గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 4 రోజుల పాటు హంద్రీనదికి నీటిని విడుదల చేశారు. అయితే హంద్రీనదికి నీటిని వదిలి వారం రోజులు కూడా గడవకముందే నీటి విడుదల నిలిపేశారు. దీంతో గ్రామంలో మంచినీటి సమస్య మళ్లీ మొదటికి వచ్చింది. నీటి సమస్య పరిష్కరించాలంటూ రెండు నెలల పాటు ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులరిగేలా తిరిగితే హంద్రీనదికి తూతూ మంత్రంగా నాలుగు రోజులు వదిలి బంద్ చేయడం ఎంత వరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మరికొన్ని రోజులు హంద్రీనదికి నీటి విడుదల కొనసాగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
– కోడుమూరు రూరల్


