ఈవీఎం గోడౌన్‌కు పటిష్ట భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఈవీఎం గోడౌన్‌కు పటిష్ట భద్రత కల్పించాలి

Aug 21 2026 7:51 AM | Updated on Aug 21 2026 7:51 AM

నంద్యాల: ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద 24/7 నిరంతరం నిఘా, పటిష్టమైన భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలు మేరకు నెల తనిఖీల్లో భాగంగా నంద్యాల మార్కెట్‌ యార్డ్‌ టెక్‌ గోడౌన్‌లో గురువారం కలెక్టర్‌ రాజకుమారి భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, సీలింగ్‌, ఫైర్‌ సేఫ్టీ తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ఈవీఎం గోడౌన్‌ రిజిస్టర్‌లో సంతకం చేశారు. కలెక్టర్‌ వెంట డీఆర్‌ఓ రాము నాయక్‌, ఆర్‌డీఓ విశ్వనాథన్‌, ఎలక్షన్‌ డీటీ మనోహర్‌, నంద్యాల తహసీల్దార్‌ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement