పుట్లూరులో 20 రోజులకే చిరిగిన బ్యాగ్‌లు
కృష్ణగిరి: చంద్రబాబు ప్రభుత్వంలో విద్యకు ఎంత మాత్రం ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ బ్యాగ్‌లను చూస్తే అర్థమవుతోంది. పాఠశాలలు తెరిచిన రెండు నెలలకు బ్యాగ్‌లు ఇచ్చినా వాటిలో నాణ్యత లేదనే విషయం కేవలం 20 రోజుల్లోనే బయటపడింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 20 రోజుల కింద స్కూల్ బ్యాగ్‌లు, షూలు, బెల్ట్ ఇచ్చారు. కొత్త బ్యాగ్‌లు అప్పుడే చిరిగి పనికి రాకుండా పోయే పరిస్థితి నెలకొంది. మూడేళ్ల కిందట జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన బ్యాగ్‌లను నేటికీ పిల్లలు వాడుతున్నారని, అలాంటిది చంద్రన్న ఇచ్చిన బ్యాగులు 20 రోజులకే చిరిగిపోవడం చూస్తే ప్రభుత్వ విధానం అర్థమవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు. తమ ప్రభుత్వం విద్యార్థులను నాణ్యమైన కిట్లు అందిస్తోందని డప్పాలు చెప్పుకునే విద్యాశాఖ మంత్రి ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నారు. బుధవారం అమకతాడు, పుట్లూరు గ్రామాల్లోని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇలా చిరిగిన బ్యాగులతో అవస్థలు పడుతూ కనిపించారు.


