భూ సేకరణ వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

భూ సేకరణ వేగవంతం చేయండి

Aug 18 2026 12:57 AM | Updated on Aug 18 2026 12:57 AM

డోన్‌: గుంటూరు – గుంతకల్‌ రైల్వే డబ్లింగ్‌, విద్యు ద్దీకరణ పనులకు అవసరమైన భూ సేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి రెవెన్యూ డివిజనల్‌ అధికారి నరసింహులును ఆదేశించారు. సోమవారం ఆమె డోన్‌ మండలం దొరపల్లె గ్రామం వద్ద భూసేకరణను పరిశీలించారు. గుంతకల్‌ రైల్వే మార్గంలో 47 కి.మీ మేర సేకరించిన భూముల వివరాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూసేకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. భూసేకరణలో భాగంగా ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలు, రహదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని ఆమె హామీ ఇచ్చారు. కలెక్టర్‌ వెంట దక్షిణ మధ్య రైల్వే సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ ఆనంద్‌, డోన్‌ తహసీల్దార్‌ రవికుమార్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement