ఈ ఏడాది ఇంతవరకు గ్రాంటు రాలేదు. ప్రతి పనికి చేతి నుంచి పెట్టుకో వాల్సి వస్తోంది. ఇప్పటికి చేతి నుంచి ఒక్కొ క్కరు రూ.3 వేల దాక పెట్టుకున్నారు. పాఠశాలకు వచ్చేది అంతా నిరుపేదలే. వారికి అన్ని ఉచితంగానే సమకూర్చాలి. నిధులు ఒక్క రూపాయి కూడా రాక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.
– రమణయ్య, పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
పాఠశాలలు తెరిచి రెండు నెలలు దాటిపోతోంది. ఇంత వరకు మెయింటెనెన్సు గ్రాంటు రూపాయి కూడా రాలేదు. గత రెండు విద్యా సంవత్సరాల్లో సైతం సగం నిధులు మాత్రమే ఇచ్చారు. అన్ని గ్రాండ్‌గా నిర్వహించాలని ఆదేశాలు ఇస్తారు వాటి నిర్వహణకు చాలా ఖర్చు అవుతోంది. నిధులు లేకుండా ఎలా నిర్వహించాలి. ఇప్పటికై నా నిధులు వెంటనే విడుదల చేయాలి.
– ఐజయ్య, యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్


