చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రి మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో రూ.25 లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలున్నాయి. ఈ బండారం బయట పడుతుందని గతంలో ఇన్‌చార్జ్ ఈఓగా పని చేసిన ఓ అధికారిణి.. ఆమె స్థానంలో బదిలీపై ఈఓగా వచ్చిన సబియాకు నెల రోజులు గడిచినా పూర్తి బాధ్యతలు అప్పగించడం లేదు. గత నెల జూలై 13వ తేదీన సబియా ఈఓగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆమె డిజిటల్ కీ, లాగిన్ అప్పగించ లేదు. పూర్తి బాధ్యతలు అప్పగించడంలో జాప్యం చేస్తుండటంతో అనుమానాలు రెకెత్తుత్తున్నాయి. ఏప్రిల్ నెల నుంచి వివిధ పన్నుల ద్వారా పంచాయతీకి వచ్చిన ఆదాయాన్ని చలానా కట్టి పంచాయతీ ఖాతాలో జమా చేయకుండా దుర్వినియోగం చేసినట్లు సమాచారం. అక్రమాలు వెలుగు చూడకుండా దాచి పెట్టేందుకు చార్జ్ అప్పగించడం లేదనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సబియా నాలుగు రోజుల క్రితం తనకు పూర్తి స్థాయి చార్జ్ అప్పగించాలని ప్రత్యేక అధికారి తాహెర్ హుస్సేన్‌కు వినతి పత్రం అందజేశారు.
చాగలమర్రి పంచాయతీలో
పన్ను వసూలు పక్కదారి
ఈఓకు చార్జ్ అప్పగించని
ఇన్‌చార్జ్ అధికారిణి
అక్రమాలు వెలుగుచూడకుండా
దాచిపెడుతున్న వైనం


