మల్లన్న సేవలో.. | - | Sakshi
Sakshi News home page

మల్లన్న సేవలో..

Aug 17 2026 1:41 AM | Updated on Aug 17 2026 1:41 AM

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామిఅమ్మవార్లను శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్దరామ శివాచార్య మహాస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఆదివారం మల్లన్న దర్శనార్థం ఆల యం వద్దకు విచ్చేసిన పీఠాధిపతికి రాజగోపురం వద్ద దేవస్థాన ఈఓ శ్రీనివాసరావు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి మల్లికార్జున స్వామివారికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం అమ్మవారి ఆలయంలోని ఆశీర్వచన మండపంలో పీఠాధిపతి గౌరవార్థం వేదగోష్ఠి నిర్వహించారు. పీఠాధిపతి భక్తులకు అనుగ్రహభాషణ చేశారు.

నేడు కలెక్టరేట్‌లో ప్రజా వినతుల స్వీకరణ

నంద్యాల(అర్బన్‌): స్థానిక కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో ఈనెల 17వ తేదీ సోమ వారం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ కార్యక్రమం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతుందన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడం కోసం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చన్నారు. అలాగే అర్జీదారులు దరఖాస్తుల ప్రస్తుత సమాచారాన్ని meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి తెలుసుకోవచ్చన్నా రు. అర్జీలను కూడా ఇలాగే నమోదు చేసుకోవచ్చన్నారు. అర్జీదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులందరూ తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులు స్వీకరించారు.

ఘనంగా బాలవీరాచారి శత జయంతి వేడుకలు

ఆళ్లగడ్డ: తెలుగు నేలపై శిల్పకళా వైభవాన్ని చాటిచెప్పిన ప్రసిద్ధ మహాశిల్పి దివంగత దురుగడ్డ బాలవీరాచారి శత జయంతి వేడుకలు ఆదివారం ఆళ్లగడ్డలో వైభవంగా నిర్వహించారు. స్థానిక శారదా శిల్పకళా మందిరం ఆవరణలో జరిగిన ఈ ఉత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి భారీగా శిల్ప కళాకారులు, కళాభిమానులు హాజరై ఆయనకు నివాళులర్పించారు. శిల్ప కళకు తొలినాళ్లలో ఆయన చేసిన సేవ, కృషిని కొనియాడారు. ఆళ్లగడ్డ పేరును ప్రపంచ శిల్పకళా పటంలో నిలిపిన ఘనత బాలవీరాచారికే దక్కుతుందన్నారు. అనంతరం మహాశిల్పి దురుగడ్డ బాలవీరాచారి జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన జీవిత విశేషాలు, శిల్పకళా ప్రస్థానాన్ని వివరిస్తూ తెచ్చిన ఈ పుస్తకం నేటి తరం యువ శిల్పులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా నిలుస్తుందని పలువురు అన్నారు.

గాలేరుకు నీటి విడుదల

పాణ్యం: గోరుకల్లు జలాశయం నుంచి జీఎన్‌ఎస్‌ఎస్‌ (గాలేరునగరి సుజల స్రవంతి) కాల్వలకు అధికారులు ఆదివారం కాల్వకు నీటిని వదిలారు. ఈ సందర్భంగా ఈఈ శివప్రసాద్‌ మాట్లాడుతూ అవుకు జలాశయానికి నీటిని తరలిస్తున్నట్లు తెలిపారు. గోరుకల్లు జలాశయంలో 5.5 టీఎంసీలు నిరునిల్వ ఉండగా బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి 5 వేల క్యూసెక్కులు వస్తున్నట్లు తెలిపా రు. ఉదయం గేట్లు ఎత్తగా సాయంత్రానికి నీరు గేట్లును తాకినట్లు తెలిపారు. పై నుంచి వచ్చిన నీటిని దిగువకు పంపుతున్నట్లు తెలిపారు.

నూర్‌బాషా విభాగం జిల్లా అధ్యక్షుడిగా దస్తగిరి

కొలిమిగుండ్ల: బెలుం గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు దూదేకుల దస్తగిరి జిల్లా నూర్‌బాషా(దూదేకుల) విభాగం జిల్లా అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడులైంది. అనుబంధ విభాగాల కమిటీలో చోటు కల్పించడంతో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి దస్తగిరి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement