ఆకట్టుకున్న శకటాలు | - | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న శకటాలు

Aug 16 2026 5:33 AM | Updated on Aug 16 2026 5:33 AM

విద్యార్థిని

స్వాతంత్య్ర దినోత్సవంలో జిల్లా అభివృద్ధిని ప్రతిబింభించేలా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రగతి శకటాలను ప్రదర్శించారు. వ్యవసాయ, మున్సిపల్‌ శాఖల శకటాలకు మొదటి బహుమతి లభించింది. రవాణా శాఖ, శ్రీశైలం దేవస్థానం శకటాలకు రెండో బహుమతి, ఉద్యానవన సూక్ష్మ నీటి సాగు శాఖ, శక్తి టీంలకు మూడో బహుమతి వచ్చింది. అనంతరం సంబంధిత శాఖల అధికారులకు బహుమతులు పంపిణీ చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

నృత్యం చేస్తున్న

గౌరవ వందనం స్వీకరిస్తున్న మంత్రి ఫరూక్‌

నంద్యాల(అర్బన్‌): రేనాటి విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నడియాడిన నేలలో 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆంధ్ర తిలక్‌ గాడిచర్ల హరి సర్వోత్తమరావును స్మరించుకుంటూ.. పెండేకంటి వెంకటసుబ్బయ్య, బీవీ సుబ్బారెడ్డి సేవలను గుర్తు చేసుకుంటూ జాతీయ జెండాకు సెల్యూట్‌ చేశారు. గోసాయి వెంకన్న, వడ్డే ఓబన్న, నంద్యాల కాదర్‌బాద్‌ నర్సింగరావు, యాళ్లూరి స్వామిరెడ్డి, గుర్రం వెంకటరెడ్డి, గామాగో ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని మంత్రి ఫరూక్‌ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. వేడుకలకు జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, ఎస్పీ సునిల్‌షెరాన్‌, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, డీఆర్‌ఓ రామునాయక్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల నుంచి మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రసంగిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులందరూ సమన్వయంగా పనిచేసి అభివృద్ధిలో నంద్యాల జిల్లాను అగ్రభాగాన నిలిపేందుకు అంకితం కావాలన్నారు.

తాగునీటి అవసరాలకే శ్రీశైలం నీరు

శ్రీశైలం నుంచి వచ్చే నీటిని సాగుకు కాకుండా తాగునీటి అవసరాలకే వినియోగించుకోవాలని మంత్రి అన్నారు. జిల్లాలో 293 గ్రామాల్లో రీ సర్వే, 233 గ్రామాలకు సంబంధించి 1.35 లక్షల పాసు పుస్తకాల ముద్రణ పూర్తయిందన్నారు. హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.

నంద్యాలలో వైభవంగా

పంద్రాగస్టు వేడుకలు

జాతీయపతాకాన్ని ఆవిష్కరించిన

మంత్రి ఫరూక్‌

హాజరైన కలెక్టర్‌, జేసీ, ఎస్పీ,

ప్రజాప్రతినిధులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement