వర్షాల్లేక ఇప్పటికే 20 ఎకరాల్లో మొక్కజొన్న పంట దున్నేశా. మూడు ఎకరాల్లో పత్తికి సాగునీరు లేదు. కళ్లెదుటే కేసీ కాల్వలో నీరుపారుతున్నా పంట ఎండిపోవడం చాలా బాధగా ఉంది. తడి నీరివ్వాలని ఏఈని అడిగితే పైనున్న సారోళ్లు అనుమతివ్వాలంటున్నారు.
– రవికుమార్ యాదవ్, రైతు
నాకున్న ఎకరా పొలంలో పత్తిపంటను సాగుచేశాను. పంటసాగుచేసినప్పటి నుంచి వర్షాల్లేక పంట ఎదుగుదలలేక కేవలం రెండు, మూడు అడుగుల ఎత్తుపెరిగి పూత, పిందవచ్చాయి. చివరిదశలో ఉన్న పంటకు నీళ్లుపెట్టుకొని కాపాడుకొందామంటే సారొళ్లు కాల్వలకు నీరివ్వటం లేదు. – రామకృష్ణ, రైతు
కేసీ కాల్వకు వదులుతున్న నీరు తాగునీటి అవసరాల నిమిత్తం మాత్రమే. కాల్వ వెంట ఉన్న తూములను అన్నింటినీ పూర్తిగా బంద్‌చేసి దిగువకు తరలిస్తున్నాం. ఉన్నతాధికారులు అనుతిస్తేనే రైతులు పంటలకు నీటిని పారించుకొనేందుకు అనుమతిస్తాం. – శ్రీనివాసనాయక్, ఏఈ,


