ఎమ్మిగనూరురూరల్: ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి గర్భవతి అరికంటి శైలును తరలిస్తుండగా 108 అంబులెన్స్‌లో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఏనుగుబాల గ్రామానికి చెందిన ఈమెకు నొప్పులు రావటంతో ఆదివారం అర్ధరాత్రి 108కు ఫోన్ చేసి సమాచారం అందించారు. రెండో కాన్పు కావటంతో గ్రామానికి చేరుకున్న అంబులెన్స్‌లో ఎమ్మిగనూరు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా కలుగొట్ల గ్రామ సమీపంలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, ఇద్దరిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించినట్లు ఈఎంటీ కై లాస్ తెలిపారు. అంబులెన్స్‌లో పైలెట్ పరుశురాం, బంధువులు ఉన్నారు.
వామ్మో కోడెనాగు
మహానంది: తిమ్మాపురం నుంచి జమాలయ్యదర్గా వెళ్లే మార్గంలో ఉన్న అశోక్‌కుమార్‌కు చెందిన అరటి పొలంలో సోమవా రం కోడెనాగు ప్రత్య క్షం కావడంతో వ్యవసాయ కూలీలు భ యాందోళనకు గురయ్యారు. అశోక్‌కుమార్ వెంటనే అయ్యన్ననగర్ గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ మోహన్‌కు సమాచారం అందించడంతో వెంటనే పొలం వద్దకు చేరుకుని సుమారు ఆరు అడుగుల పొడవున్న కోడెనాగును పట్టుకుని సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో వదిలేశాడు.
డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో ముగ్గరికి జైలు శిక్ష
డోన్ రూరల్: వివిధ ప్రాంతాల్లో డ్రంకన్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 8 మందిలో ముగ్గురికి జైలు శిక్ష, ఐదుగురికి ఒక్కొక్కరి చొప్పున రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. డోన్ టౌన్ పోలీస్ సేష్టన్ పరిధిలో మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన పట్టణానికి చెందిన టీఆర్ నగర్‌కు చెందిన పి.వెంకటేష్‌కు ఏడు రోజులు జైలు శిక్ష, పాతపేటకు చెందిన ఈడిగ ప్రతాప్‌కు, చిగురుమానుపేటకు చెందిన డి. మహబూబ్ బాషాకు నాలుగు రోజులు జైలు శిక్ష పడింది. కొత్తపేటకు చెందిన డి. బాలాంజనేయులు, వైఎస్ నగర్‌కు చెందిన జి విజేయుడు, టీఆర్ నగర్‌కు చెందిన విష్టు వర్ధన్ ఆచారి, చిగురుమానుపేటకు చెందిన రామాంజినేయులు, సుజాతమ్మనగర్‌కు చెందిన శ్రీరాములుకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ సోమవారం డోన్ స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూరుల్లా తీర్పు ఇచ్చినట్లు అర్బన్ సీఐ ఇంతియాజ్ బాషా తెలిపారు.


