శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైలం జలాశయంలోకి జూరాల ప్రాజెక్టు నుంచి వచ్చే వరద ప్రవాహం తగ్గింది. శుక్రవారం నుంచి శనివారం వరకు శ్రీశైలానికి 2,11,632 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. శనివారం సాయంత్రం నాటికి ఇన్‌ఫ్లో 1,68,020 క్యూసెక్కులకు పడిపోయింది. జలాశయం నుంచి దిగువ ప్రాజెక్టులకు 47,278 క్యూసెక్కుల నీరు విడుదలైంది. విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగర్జునసాగర్‌కు 37,141 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 1,133 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా 8వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 875 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. శనివారం జలాశయంలో 176.7402 టీఎంసిల నీరు నిల్వ ఉండగా.. డ్యాం నీటిమట్టం 877.70 అడుగులకు చేరుకుంది.


