కరువు తెచ్చిన నష్టం | - | Sakshi
Sakshi News home page

కరువు తెచ్చిన నష్టం

Aug 8 2026 1:47 AM | Updated on Aug 8 2026 1:47 AM

పగిడ్యాల/జూపాడుబంగ్లా: తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని మొక్కజొన్న పైర్లలో ఎదుగుదల లోపించింది. రెండు నెలలు అయినా ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. దీంతో వర్షధార పంటలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. నష్టం తప్పదని భావించిన రైతులు పంటలను చెరిపేసి మద్యకారు కింద మినుము సాగు చేసేందుకు సమాయత్తం అవుతున్నారు. పగిడ్యాల గ్రామానికి చెందిన నాగన్న అనే రైతు సాగు చేసిన మూడు ఎకరాల మొక్కజొన్న పైరును గొర్రెల మేతకు అప్పగించి కన్నీటి పర్యంతమయ్యారు. అలాగే జూపాడుబంగ్లా మండలం తర్తూరులో సుంకిరెడ్డి అనే రైతు నాలుగు ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంటను శుక్రవారం రొటావేటర్‌తో దున్నేశాడు. తనకు రూ.80వేల నష్టం, నాగిరెడ్డి అనే రైతు 12ఎకరాల్లో సాగుచేసిన పంటను రొటావేటర్‌తో దున్నేయగా తనకు రూ.2.50 లక్షల పంటనష్టం వాటిల్లింది. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తర్తూరులో మొక్కజొన్న పంటను దున్నేస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement