కర్నూలు (టౌన్): తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు డబ్బుల పంచాయితీలో బజారులో రాళ్లతో కొట్టుకుంటే వైఎస్సార్‌సీపీకి ఏమి సంబంధమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కర్నూలులో షేక్ ఇంతియాజ్ హత్య ఘటనలో అన్యాయంగా ఇమ్రాన్, వస్తాద్‌లను ఇరికించారన్నారు. కత్తులు, కటార్లు పట్టుకుని దాడి చేశారా, అప్పటికప్పుడు రాళ్లతో కొట్టుకుని చనిపోతే వీరికేమి సంబంధమని ప్రశ్నించారు. పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే పాతబస్తీలోని మాసూం బాషా దర్గా వద్ద జరిగిన హత్య ఘటనకు సంబంధించి సీసీ కెమెరాల ద్వారా వీడియోలను బహిరంగపరచాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం నేతల ఒత్తిడితోనే సంబంధం లేని వ్యక్తులను హత్య కేసులో ఇరికించాలని చూస్తున్నారన్నారు. మంత్రి ప్రోద్బలంతోనే ఈ కుట్ర చేస్తున్నారని, న్యాయపరంగా ఈ కేసును ఎదుర్కొంటామన్నారు. ఇటువంటివి మంచి పద్ధతి కాదని, ప్రభుత్వం మారితే ఇదే సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరించారు. హత్య కేసులో నమోదు చేసిన పేర్లకు సంబంధించి పోలీసులు నిజానిజాలు తేల్చాలన్నారు.
గురువారం రాత్రి కర్నూలు పాతబస్తీలో షేక్ ఇంతియాజ్ హత్య ఘటనలో వైఎస్సార్‌సీపీకి ఎలాంటి సంబంధం లేదని మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ స్పష్టం చేశారు. అనవసరంగా హత్య ఘటనలో లేని వ్యక్తులను ఇరికించడం టీడీపీకి నేతలకు తగదన్నారు. ఇది మంచి పరిణామం కాదన్నారు.సంబంధం లేని వ్యక్తుల పేర్లు నమోదు చేయకుండా పోలీసు యంత్రాంగానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలన్నారు.
– మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్
ఇమ్రాన్, వస్తాద్‌లను
అక్రమంగా కేసులో ఇరికించారు
హత్య ఘటనలో సీసీ కెమెరాలను
పోలీసులు బయటపెట్టాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్‌రెడ్డి


