నేడు జెడ్పీలో సాగు, తాగునీటిపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

నేడు జెడ్పీలో సాగు, తాగునీటిపై సమీక్ష

Aug 7 2026 6:22 AM | Updated on Aug 7 2026 6:22 AM

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌లోని మినీ సమావేశ భవనంలో ఈ నెల 6న మధ్యాహ్నం 3 గంటలకు ఉమ్మడి జిల్లాలో సాగు, తాగునీటికి సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ ఆర్‌.సుధాకర్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.జెడ్పీ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సమావేశంలో జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణ, సాగునీటి కాలువల ద్వారా నీటి విడుదల అంశాలపై సమీక్ష కొనసాగుతుందన్నారు.సమావేశానికి ఉమ్మడి జి ల్లాకు చెందిన జెడ్పీటీసీ,ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగే ష న్‌ అధికారులు హాజరుకావాలని ఆయన కోరారు.

హంద్రీ–నీవా కాలువకు 350 క్యూసెక్కుల నీరు విడుదల

నందికొట్కూరు: హంద్రీ–నీవా కాలువకు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ జీ రాజన్‌బాబు తెలిపారు. మల్యాల ఎత్తిపోతల పథకంలో బుధవారం మోటార్లకు,గంగమ్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హంద్రీ–నీవా కాలువకు 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు హంద్రీ–నీవా కాలువకు ఒక పంపు ద్వారా నీటిని విడుదల చేస్తున్నామన్నారు.

కొలనుభారతిలో

రేపు శాకంబరీ ఉత్సవం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీకొలనుభారతి క్షేత్రంలో శుక్రవారం సరస్వతి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు దేవస్థాన చైర్మన్‌ పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటలో బుధవారం తెలిపారు. లోకకల్యాణం కోసం మొట్టమొదటిసారిగా సరస్వతి అమ్మవారికి ఈ విశేష ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారిని పలు రకాల అకుకూరలు, కూరగాయలు, ఫలాలతో అలంకరింపజేసి విశేష పూజలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులందరూ ఉత్సవంలో పాల్గొనాలని కోరారు.

డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులో

ఒకరికి జైలు

డోన్‌ రూరల్‌: మద్యం మత్తులో వాహనం నడిపిన ఒకరికి రెండు రోజులు జైలు శిక్ష విధించారు. వై చౌడప్ప(23) అనే వ్యక్తి డ్రంక్‌ డ్రైవ్‌లో పట్టుబడగా పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో బుధవారం హాజరు పరిచారు. రెండు రోజులు జైలు శిక్ష విధిస్తూ డోన్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నూరుల్లా తీర్పు నిచ్చారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారికి భారీ జరిమానాలు, జైలు శిక్ష తప్పవని సీఐ రాకేష్‌, ఎస్‌ఐ మమత తెలిపారు.

ప్రశాంతంగా ‘టెట్‌’

నంద్యాల(న్యూటౌన్‌): జిల్లాలో బుధవారం టెట్‌ (టీచర్‌ ఎలిజబులిటీ టెస్టు) ప్రశాంతంగా జరిగిందని డీఈఓ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఉదయం సెషన్‌లో310 మందికిగాను 278 మంది (89.68 శాతం), మధ్యాహ్న సెషన్‌లో 310 మంది గాను 273 మంది(88.06శాతం) హాజరైనట్లు చెప్పారు. పరీక్ష రాసేవారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

కొత్త ఓటరు నమోదుకు

30 వరకు అవకాశం

నంద్యాల(అర్బన్‌): కొత్త ఓటరు నమోదుకు ఈనెల 30 వరకు అవకాశం ఉందని జిల్లా కలెక్టర్‌ రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా హేతుబద్ధీకరణ అనంతరం 1,629 పోలింగ్‌ కేంద్రాలకు అదనంగా 134 చేరి మొత్తం 1,763 అయ్యాయని పేర్కొన్నారు. ఓటరు కార్డులో మార్పులు, చేర్పులు, కొత్త ఓటరు నమోదుకు ఈనెల 30 వరకు అవకాశం ఉందదని తెలిపారు. ముసాయిదా ఓటరు జాబితాలో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా సంబంధిత బీఎల్‌ఓలు, ఈఆర్‌ఓల దృష్టికి తేవాలన్నారు.

శ్రీశైలంలో రేపటి నుంచి సహస్ర ఘటాభిషేకం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైలంలో శుక్రవారం నుంచి ఈ నెల 11వ తేదీ వరకు ఐదు రోజుల పాటు వరుణయాగ సహిత సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు, ఈఓ ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు గణపతిహోమం, రుద్రహోమం, మృత్యుంజయహోమం, చండీహోమం, వృద్దమల్లికార్జునస్వామివారి వద్ద జరిగే ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ఆర్జితపరోక్ష సేవలు కూడా నిలుపుదల చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement