నంద్యాల(న్యూటౌన్): పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ చెవిలో పూలు పెట్టుకొని మోకాళ్లపై బుధవారం కలెక్టరేట్ ఎదుట డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భ ంగా డీవైఎఫ్‌ఐ నంద్యాల పట్టణ కార్యదర్శి శివ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ప్రకటించిన పోస్టులను భర్తీ చేయాలన్నారు. కేవలం 2,500 పోస్టులొద్దని మొత్తం11,639 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించినా ఇంత వరకు అమలు చేయడం లేదన్నారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ లేకపోవడంతో అభ్యర్థులు వయస్సును కోల్పోతున్నారన్నారు. జనరలైజేషన్ పరిగణనలోకి తీసుకొని అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని, లేని పక్షంలో విడతల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ధర్నాలో కానిస్టేబుల్ అభ్యర్థులు యాకూబ్, అజారుద్దీన్, నారాయణస్వా మి, వినయ్, కుమార్, సుమంత్, ఓబయ్య, సా యి,అశోక్,రాజశేఖర్, మధు తదితరులు పాల్గొన్నారు.


