శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ప్రారంభించారు. శ్రీశైలం డ్యాం నీటిమట్టం 860 అడుగులకు పైబడగానే మంగళవారం రాత్రి నుంచి తెలంగాణ ప్రభుత్వం ఉత్పాదన మొదలుపెట్టింది. జలాశయ ం నుంచి 4,267 క్యూసెక్కుల నీటిని వాడుకొని 2.087 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ంది. బుధవారం కూడా విద్యుత్ ఉత్పాదనను కొనసాగిస్తోంది. అలాగే బ్యాక్ వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతలకు 800 క్యూసెక్కుల నీటిని వినియోగించుకున్నారు. ఆంధ్ర ప్రాంతంలోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ప్రభుత్వ అనుమతులు లేక ఉత్పాదనను ఇప్పటికీ ప్రారంభించనట్లు తెలుస్తోంది.


