షార్టు సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం
డోన్ టౌన్: మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన బోయ సుంకులమ్మ ఇంటిలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటిలో నుంచి పొగలు రావడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న డోన్ అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫ్రిడ్జ్‌లో షార్ట్‌సర్క్యూట్ జరిగి మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బీరువా లో ఉన్న రూ.3 లక్షల విలువవైన ప్రాంసరీ నోట్లు, ఎల్‌ఐసీ డాక్యూమెంట్లు, పొలం పాస్‌బుక్‌తో పాటు కొంత బంగారం, కొంత నగదు దగ్ధమైనట్లు తెలిసింది. వీటితో పాటు ఇంటిలో నిత్యావసరుకులు, దుస్తు లు కాలి బూడిదయ్యాయి. దాదాపు రూ.3 లక్షల వరకు నష్టం వాటిల్లి ఉండవచ్చునని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనా చేశారు.


