మంచు దోచిన జీవన అందాలు
తెల్లారింది కానీ పొద్దు పొడవలేదు. ఆకాశంలో సూర్యుడు వీధి దీపంలా వెలుగుతున్నాడు. ప్రజలు అంతా వారి పనుల మీద బయటకు కదులుతున్నారు. చుట్టూ దట్టమైన పొగమంచు. ఎటు చూసినా నింగి, నేల ఏకమైనట్లు కనిపించే దృశ్యాలు. ఆ సమయంలో మంచు చాటున మది దోచే అద్భుత చిత్రాలు పల్లె సీమల్లో ఆవిష్కృతమయ్యాయి. జీవన సౌందర్యానికి మంచు తోడైంది. ఉదయాన్నే పాఠశాల బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు.. చలించక ఎవరి పనులు చేసుకుంటున్న గ్రామీణ జనం.. లైట్ల వెలుతురులో నెమ్మదిగా వెళ్తున్న వాహనాలు.. పైర్లపై ముత్యాల్లా మెరిసిన మంచు బిందువులు.. అన్నీ వెరిసి కోనసీమ ను తలపించే ప్రకృతి అందాలు కనువిందు చేశాయి.శుక్రవారం ఉదయం 8 గంటల సమయంలో మంత్రాలయం –నాగలదిన్నె రహదారిలో ఈ దృశ్యాలు కనిపించాయి. – మంత్రాలయం రూరల్
పొలం పనులకు వెళ్తున్న మహిళ
స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డుపై బస్సు కోసం వేచి ఉన్న విద్యార్థులు
మంచు మాటున్న సూర్యుడు.. లైట్ల వెలుతురులో వాహనం
పచ్చని పొలాలపై తెల్లని పొగమంచు
మంచు దోచిన జీవన అందాలు
మంచు దోచిన జీవన అందాలు
మంచు దోచిన జీవన అందాలు


