రహదారి భద్రత సామూహిక బాధ్యత
రహదారి భద్రత అనేది మనందరి సాంఘిక బాధ్యత. డ్రైవింగ్ చేసేటప్పుడు మనం పాటించే చిన్నపాటి జాగ్రత్తలు ఎంతో విలువైన ప్రాణాలను కాపాడతాయి. మా సంస్థ (రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవే లిమిటెడ్) మెరుగైన మౌలిక సదుపాయాలను అందించడమే కాకుండా ప్రయాణికుల భద్రత కోసం 24 గంటలూ అందుబాటులో ఉండే అత్యవసర స్పందన వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవాలని మేము కోరుకుంటున్నాం. రహదారి భద్రత–ప్రాణ రక్ష, సురక్షితంగా ప్రయాణించండి–క్షేమంగా ఇంటికి చేరుకోండి.. అనే నినాదంతో నెల రోజుల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– వి.మదన్ మోహన్, ప్రాజెక్ట్ హెడ్


