మద్యం స్వాధీనం
శ్రీశైలం: శ్రీశైలం దేవస్థానం పరిధిలోని టోల్‌గేట్ వద్ద తనిఖీల్లో మద్యం సీసాలు పట్టుబడ్డాయి. వన్‌టౌన్ సీఐ జీవన్ గంగనాథ్ బాబు శుక్రవారం తెలిపిన వివరాల మేరకు.. ఈనెల 31వ తేదీ ఆత్మకూరు మండలానికి చెందిన మాండ్ల కొలను భరత్, గొల్ల మాసయ్య ఆత్మకూరులోని ఒక వైన్ షాపు నుంచి కేసు చీప్ లిక్కర్ బాటిళ్లను కొనుగోలు చేశారు. నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో అధిక రేట్లకు విక్రయించేందుకు గురువారం బైక్‌పై శ్రీశైలం తరలిస్తుండగా టోల్‌గేట్ వద్ద తనిఖీల్లో దేవస్థానం సీఎస్‌ఓ శ్రీనివాసరావుకు పట్టుబడ్డారు. ఇద్దరిని అదుపులోకి తీసుకుని, 41 మద్యం సీసాలను సీజ్ చేశారు. నిందితులను ఆత్మకూరు కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారని సీఐ తెలిపారు.


