పోలీసులపై చర్యలు తీసుకోవాలి
ఆదోని రూరల్: ఇటీవల పత్తికొండ కోర్టు హాల్‌లో జరిగిన ఘటనను నిరసిస్తూ ఆదోని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి పి.జె.సుధకు పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరు తూ వినతి పత్రం అందించారు. అనంతరం బార్ అసోసియేషన్ సెక్రటరీ జీవన్‌సింగ్, సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ.. పత్తికొండ కోర్టు హాలులో గత నెలలో లొంగిపోవడానికి వచ్చిన నిందితుడిని పోలీసులు అక్రమంగా పట్టుకెళ్లారన్నారు. పోలీసులపై చర్యలు తీసుకునేంత వరకు ఉద్యమాలను ఆపబోమన్నారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సీనియర్ న్యాయవాదులు విశ్వనాథరెడ్డి, మన్సూర్ అమ్మద్, రామలింగ, మధు, షబాష్ అహ్మద్, ఆసీఫ్ తదితరులు ఉన్నారు.


