ఎందుకూ ఉపయోగపడటం లేదు
ఖరీఫ్‌లో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాం. రబీలో కూడా వేస్తున్నాం. ప్రభుత్వం సీసీఆర్‌సీ కార్డు కూడా మంజూరు చేసింది. అయితే కౌలుదారు ఆర్థిక చేయూతకు ఏమాత్రం తోడ్పడటం లేదు. అన్నదాత సుఖీభవ కూడా రాలేదు. బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు. కనీసం కార్డుపైన యూరియా కూడా తీసుకోలేకపోతున్నాం. ప్రభుత్వం చొరవ తీసుకొని కౌలు రైతులకు అన్ని రకాల ప్రయోజనాలు వర్తింపజేయాలి.
– ఉప్పరి కాశయ్య, బోయరేవుల గ్రామం, వెలుగోడు మండలం
సీసీఆర్‌సీ కార్డులు పొందిన సాగుదారులకు రుణాలు ఇవ్వలేం. కర్నూలు మండలం పసుపల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ద్వారా 366 మంది కౌలు రైతులకు రుణాలు పంపిణీ అయ్యాయి. ఇందులో 359 మంది రైతులు రుణాలు చెల్లించలేదు. మొత్తంగా రూ.144.18 లక్షలు నిరర్థక ఆస్తుల్లోకి వచ్చింది. అందువల్ల రుణాలు ఇవ్వలేకపోతున్నాం.
– గత నవంబర్ 21న డీసీసీ/డీఎల్‌ఆర్‌సీ సమావేశంలో
ఎల్‌డీఎం రామచంద్రరావు


